Jani Master: జానీ మాస్టర్‌కు మరో సినిమా ఛాన్స్! డైరెక్టర్ వైవీఎస్‌ చౌదరితో ఫొటోస్ వైరల్

లైంగిక ఆరోపణలతో జైలుకెళ్లిన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. కాగా పోక్సో కేసులో ఇరుక్కోవడంతో జానీ మాస్టర్ కు రావాల్సిన జాతీయ అవార్డు దూరమైంది. పుష్ప 2తో పాటు పలు సినిమా ఛాన్సులు కూడా పోయాయి.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో సినిమా ఛాన్స్! డైరెక్టర్ వైవీఎస్‌ చౌదరితో ఫొటోస్ వైరల్
Jani Master, YVS Chowdhary
Follow us
Basha Shek

|

Updated on: Dec 19, 2024 | 9:34 AM

లైంగిక ఆరోపణల కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు జానీ మాస్టర్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. పోక్సో కేసుకు కారణంగా జాతీయ అవార్డు నిలిచిపోయింది. అలాగే పుష్ప 2 సినిమా ఛాన్స్ కూడా దూరమైంది. అయితే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు జానీ మాస్టర్. తన టీంతో కలిసి మళ్లీ డాన్స్ స్టూడియోలో డాన్స్ రిహర్సల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా బాలీవుడ్ హీరో వరుణ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కు జానీ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు సమాచారం. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ లోని ఓ పాటకు కూడా జానీ కొరియోగ్రాఫీ అందించాడు. ఈ పాట నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ ఉంటుందని, ఇదొక కొత్త ప్రయోగం చేశామని, ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరూ చేయలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వైవీఎస్‌ చౌదరిని జానీ మాస్టర్ కలవడం, సరదాగా ఫొటోల దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వైవీఎస్ జానకీ రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో వైవీఎస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా పాటలు జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడా? అని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా దర్శకుడు వైవీఎస్ చౌదరితో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు జానీ మాస్టర్ .. ‘చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి గారిని కలిసాను. నా కెరీర్ ప్రారంభంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ ను నేనెప్పుడూ మర్చిపోలేను. ఆయన మాటలు నాకు మళ్లీ అపారమైన శక్తిని ఇచ్చాయి. తెలుగులో డాన్స్ మాస్టర్లకు మంచి అవకాశాలు ఇచ్చి, ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది దర్శకులలో వైవీఎస్ గారు కూడా కూడా ఒకరు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ జానీ మాస్టర్ రాసుకొచ్చారు.

వైవీఎస్ చౌదరితో జానీ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..