Manchu Nirmala: మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి నిర్మల..

Manchu Nirmala: మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి నిర్మల..

Anil kumar poka

|

Updated on: Dec 19, 2024 | 9:35 AM

మంచు ఫ్యామిలీ గొడవల్లో ట్విస్టుల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన వివాదంలో మనోజ్ చెబుతోంది అబద్ధమంటూ తల్లి నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఇంట్లో విష్ణు ఎలాంటి గొడవ చేయలేదంటూ స్పష్టం చేశారు. పహాడీ షరీఫ్‌ పోలీసులకు మోహన్‌బాబు భార్య నిర్మలాదేవి లేఖ రాశారు.

తన పుట్టిన రోజు ఎలాంటి గొడవ జరగలేదంటూ అందులో చెప్పుకొచ్చారు. ఆరోజు ఇంట్లోని జనరేటర్‌లో విష్ణు పంచదార పోశారంటూ మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి నిర్మల ఖండించారు. తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసేందుకే విష్ణు వచ్చాడని, కేక్‌ కట్‌ చేశాక తన సామాన్లు మాత్రమే తీసుకుని వెళ్లాడని చెప్పారు నిర్మలా దేవి. చిన్న కొడుకు మనోజ్‌కి ఇంట్లో ఎంత హక్కు ఉందో.. పెద్ద కొడుకు విష్ణుకి కూడా అంతే హక్కు ఉందన్నారు నిర్మల. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఇంట్లో పనివాళ్లు మానేయడానికి విష్ణు కారణం కాదని వాళ్లే పనిచేయలేమని మానేశారు అంటూ వివరణ ఇచ్చారు నిర్మలదేవి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.