‘కలర్ ఫొటో’పై జగపతిబాబు ప్రశంసలు
టాలీవుడ్ అగ్ర నటుడు జగపతిబాాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా దశాబ్దాల పాటు సత్తా చాటిన ఆయన ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దుమ్ము లేపుతున్నారు.

టాలీవుడ్ అగ్ర నటుడు జగపతిబాాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా దశాబ్దాల పాటు సత్తా చాటిన ఆయన ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దుమ్ము లేపుతున్నారు. ఉన్నది ఉన్నట్లు స్టైయిట్‌గా ఫేస్ పైనే చెప్పేస్తారు జగ్గూ భాయ్. తాజాగా సుహాస్, చాందినీ చౌదరి కాంబినేషన్ లో ‘కలర్ ఫొటో’ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై జగపతిబాబు ప్రశంసలు కురిపించాడు.
‘కలర్ ఫొటో చూశాక హ్యాపీగా ఫీలయ్యా. సుహాస్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్టర్ ఈ వయస్సులోనే గుర్తుండిపోయే సినిమా తీశాడు. కాల భైరవ మ్యూజిక్ కు చాలా బాగుంది. డబ్బులు..స్టార్ డమ్ ఈ సినిమాను విజయవంతం చేయలేదు. అందరి మనస్సుకు హత్తుకుపోయేలా గొప్పగా ఉండటం వల్లే ఈ విజయం సాధ్యమైంది. యువ నటీనటులు తమ క్రియేటివిటీతో నేచురల్‌గా ఇలా ఎలా సినిమా చేయగలిగారని చాలా సార్లు నేను ఆశ్చర్యపోయాను’ అని జగపతిబాబు ట్వీట్ చేశారు. ఇలాంటి చిత్రాల్లో నటించడం నాకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. కాలాన్ని మార్చే ఇలాంటి గొప్ప సినిమాల్లో తాను నటిస్తానని జగపతిబాబు తెలిపారు.
Seeing what I believed in. I am totally impressed by watching #ColourPhoto. super kid @SandeepRaaaj did a great job for his age. @ActorSuhas a good actor proved to be a hero, @kaalabhairava7 whom I am really fond of as a person and his sensibilities of music always impresses me. pic.twitter.com/KrE6tqRwr4
— Jaggu Bhai (@IamJagguBhai) October 29, 2020
Also Read : హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు