Jagapathi Babu: భీమవరం రుచులకు జగపతి బాబు ఫిదా.. జై ప్రభాస్ అంటూ వీడియో షేర్ చేసిన జగ్గు భాయ్..

టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లుగా హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ గా, సహాయ నటుడిగా రాణిస్తున్నారు. ఓవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఆయన.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా జగ్గుభాయ్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Jagapathi Babu: భీమవరం రుచులకు జగపతి బాబు ఫిదా.. జై ప్రభాస్ అంటూ వీడియో షేర్ చేసిన జగ్గు భాయ్..
Jagapathi Babu
Follow us
B Ravi Kumar

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 11, 2024 | 12:45 PM

ఏలూరు: గోదారోళ్ల మర్యాదలు ఎంత చెప్పినా తక్కువే. అతిధి సత్కారాలకు ఎపుడూ ఏ లోటు రానివ్వరు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బంధువులు ఎవరైనా , ఎవరినైనా ఇంటికి పిలిచినా , వచ్చినా భోజనం చేయకుండా..చేయి కడగకుండా మాత్రం వెళ్ల నివ్వరు. అందుకే గోదారిళ్లు పెట్టి చంపుతారంటారు తమాషాకి. తాజాగా సినీ నటుడు జగపతిబాబు కి ఇదే అనుభవం ఎదురైంది. షూటింగ్ కోసం పశ్చిమగోదావరి జిల్లా కు వచ్చిన ఆయనకు ఓ రాజుగారు భోజనాలు పంపారు. భోజనం అంటే సాదా సీదా కాదు మరి..నాన్ వెజ్ లో అన్ని రకాల వంటల వెరైటీలు వడ్డించారు. ఇక ఆ ఐటెం లు చూడగానే జగపతిబాబు చలించిపోయారు. ఓం వీడియో తీసి మరి విడుదల చేశారు.

గోదావరి జిల్లా భీమవరంలో అతిధి మర్యాదలు, భోజనంలో వడ్డించే వంటకాల వీడియోను సినీ నటుడు జగపతిబాబు పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాలలో జరిగే షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన జగపతిబాబుకు భీమవరంలో ఒక రాజుగారు ఇంట్లో అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. రకరకాల నాన్ వెజ్ వంటకాలను జగపతిబాబుకు పంపించారు. తనకు వడ్డించే భోజనంలో రకాలను చూసి జగపతిబాబు షాక్ అయ్యారు.

ఆ వంటకాలను వీడియో చూపిస్తూ బకాసురుడిలా భోజనం చేసి, కుంభకర్ణుడిలా పడుకున్నానని, జై భీమవరం, జై రాజులు, జై ప్రభాస్ అంటూ వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు జగపతిబాబు. త్వరలో భీమవరంలో జరిగే షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.