Jabardasth Rohini: అతను నాకు ప్రపోజ్ చేసి వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు.. రోహిణి ఎమోషనల్
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ ఎపిసోడ్ జరుగుతోంది. రీసెంట్ గానే హౌస్ లో ఉన్నవారికి సర్ ప్రైజ్ ఇస్తూ.. వారి ఇంటి సభ్యులను హౌస్ లోకి పంపారు. ఇంటి సభ్యులను చూసి హౌస్ లో ఉన్నవారు ఎమోషనల్ అయ్యారు.
బిగ్ బాస్ సీజన్ సెవన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చిన దగ్గర నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షాదరణ పెరుగుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ ఎపిసోడ్ జరుగుతోంది. రీసెంట్ గానే హౌస్ లో ఉన్నవారికి సర్ ప్రైజ్ ఇస్తూ.. వారి ఇంటి సభ్యులను హౌస్ లోకి పంపారు. ఇంటి సభ్యులను చూసి హౌస్ లో ఉన్నవారు ఎమోషనల్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో పలువురు కంటెస్టెంట్స్ ప్రేమకథల గురించి చెప్పారు. తమ మొదటి ప్రేమ, బ్రేకప్ స్టోరీస్ చెప్పారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ రోహిణి కూడా తన ప్రేమ కథను తెలిపింది. తన ప్రేమ కథ విషాదాంతం అయ్యిందని తెలిపింది రోహిణి. తన స్నేహితుడే తనను మోసం చేశాడు అని బాధపడింది రోహిణి.
ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు
రోహిణి మాట్లాడుతూ.. అతను నాకు క్లోజ్ ఫ్రెండ్.. డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి, అవి క్లియర్ అయ్యాక పెళ్లి చేసుకుందాము అన్నాడు. నేను కూడా అందుకు ఓకే చెప్పాను. అతను లవ్ ప్రపోజ్ చేయగానే చాలా సంతోషించా.. కానీ అతను వేరే అమ్మయితే రెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు అని ఎమోషనల్ అయ్యింది.
Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..
వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్న విషయాన్నీ నా దగ్గర దాచాడు. ఆ తర్వాత ఎదో సిల్లీ రీజన్ చెప్పి బ్రేకప్ చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు.. అని ఎమోషనల్ అయ్యింది రోహిణి. రోహిణి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా క్రేజ్ సొంతం చేసుకుంది రోహిణి. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది రోహిణి. కాగా రోహిణికి ప్రపోజ్ చేసిన అబ్బాయి ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.
అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.