జబర్దస్త్ నటుడు కొమురక్కపై దాడి.. రాళ్లతో కొట్టి చంపుతామని బెదిరింపు
ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది ఇప్పుడు సినిమాల్లో సెటిల్ అయ్యారు కూడా.. ఇక జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో జబర్దస్త్ కొమరక్కగా ఒకరు. కొమరక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు కుమార్. తన కామెడీతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లేడీ గెటప్ లో కనిపించి నవ్వులు పూయించారు కుమార్.

జబర్దస్త్ నటుడు కొమురక్కపై దాడి జరిగింది. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు కొమరక్క. లేడీ గెటప్ తో అందరిని ఆకట్టుకున్న కొమరక్క పై దాడి అందరిని షాక్ కు గురిచేసింది. అభిమానులమని నమ్మించి కొమురక్కపై ఎనిమిది మంది దాడి చేశారు. కొమురక్క స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది ఈ ఘటన. అసలు ఏం జరిగిందంటే.. శ్రీనాథ్ అనే వ్యక్తి కొమురక్క అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.
అయితే కొమురక్క ఇంట్లో గతంలో బంగారం చోరీకి గురైంది. ఈ విషయంలో శ్రీనాథ్‌ను గట్టిగా నిలదీయగా.. తానే తీసినట్టు ఒప్పుకున్నాడు. తిరిగి ఇచ్చేస్తానని కూడా చెప్పాడు.. ఎంతకూ ఇవ్వకపోవడంతో రెండు రోజుల కిందట కొమురక్క మరోసారి మందలించారు. దాంతో మంగళవారం శ్రీనాథ్ స్నేహితులతో కలిసి తాము అభిమానులమని, ఫొటో దిగడానికి వచ్చామని నమ్మించారు.
అభిమానులు అని నమ్మి వారితో ఫోటో దిగాలని అనుకునేలోగా.. గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కొమరక్కా మీద రాయితో దాడి చేశాడు. మరో వ్యక్తి కర్రతో దాడి చేశాడు. అదుపు చేయడానికి వచ్చిన గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తిని కూడా రాళ్లతో కొట్టారు. ఎప్పటికైనా చంపుతామని బెదిరించారు. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా..అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
