AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్న చిన్న తప్పులు.. మిమ్మిల్ని పేదవారిగా మారుస్తాయి! ఎంత డబ్బున్నా వేస్ట్‌..!

ఆర్థిక తప్పిదాలు మిమ్మల్ని సంక్షోభంలోకి నెట్టగలవు. ఆదాయానికి మించి ఖర్చు, ప్రణాళిక లేని వ్యయాలు, అప్పులపై ఆధారపడటం, పొదుపు, పెట్టుబడులు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు. ఇవి దీర్ఘకాలంలో పెద్ద నష్టాలకు దారితీస్తాయి. సరైన ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ, బాధ్యతాయుత ఖర్చు అలవాట్లతో అప్పుల భారాన్ని తగ్గించుకొని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు.

ఈ చిన్న చిన్న తప్పులు.. మిమ్మిల్ని పేదవారిగా మారుస్తాయి! ఎంత డబ్బున్నా వేస్ట్‌..!
100 Rupee Note
SN Pasha
|

Updated on: Apr 02, 2026 | 7:30 AM

Share

వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో చిన్న తప్పిదాలే పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం, ప్రణాళిక లేని వ్యయాలు, అప్పులపై ఆధారపడటం వంటి అలవాట్లు వ్యక్తులను వేగంగా ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. రోజువారీ జీవితంలో కనిపించని ఈ చిన్న అలవాట్లు, కాలక్రమేణా పెద్ద నష్టాలకు కారణమవుతున్నాయి. ఆదాయం ఎంత ఉన్నా, దాన్ని మించిన ఖర్చులు చేయడం ప్రధాన ప్రమాదంగా గుర్తించబడుతోంది. క్రెడిట్ కార్డుల అధిక వినియోగం, అవసరం లేని కొనుగోళ్లు, EMIలపై అధికంగా ఆధారపడటం వంటి చర్యలు అప్పులను పెంచి, వడ్డీ భారాన్ని అధికం చేస్తాయి. దీని వల్ల వ్యక్తులు తమ సంపాదనలో పెద్ద భాగాన్ని అప్పులు తీర్చడానికే ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఇంకా ఒక ముఖ్య కారణం, పొదుపు లేకపోవడం. అత్యవసర నిధి లేకుండా జీవించడం అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగ నష్టం, వైద్య ఖర్చులు వంటి సందర్భాల్లో ఆర్థికంగా బలహీనతను పెంచుతుంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ అప్పులవైపు మొగ్గు చూపడం తప్ప మరో మార్గం ఉండదు. పెట్టుబడులు చేయకుండా, సంపాదన మొత్తాన్ని వినియోగానికి మాత్రమే ఖర్చు చేయడం కూడా దీర్ఘకాలికంగా నష్టమే. ద్రవ్యోల్బణం ప్రభావంతో డబ్బు విలువ తగ్గిపోతుంది. కాబట్టి పెట్టుబడులు లేకుండా కేవలం సేవింగ్స్‌పై ఆధారపడటం కూడా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.

అదేవిధంగా ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, బడ్జెట్ రూపొందించకపోవడం వంటి అంశాలు ఖర్చుల నియంత్రణను కష్టతరం చేస్తాయి. ఆదాయం, ఖర్చులపై స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. మొత్తంగా అజాగ్రత్త ఖర్చులు, అప్పులపై ఆధారపడే జీవనశైలి, పొదుపు లేకపోవడం వంటి అంశాలు కలిసి వ్యక్తులను వేగంగా పేదరికం వైపు నెడుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక, బాధ్యతాయుత ఖర్చు అలవాట్లు మాత్రమే దీన్ని నివారించగలవని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని పర్సనల్‌ ఫైనాన్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us