AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: IAS కావాలనుకునే అమ్మాయిపై గ్యాంగ్‌ రేప్.. ఇవాళే OTTలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ మెప్పు పొందింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గురువారం (ఏప్రిల్ 02) అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

OTT Movie: IAS కావాలనుకునే అమ్మాయిపై గ్యాంగ్‌ రేప్.. ఇవాళే OTTలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 7:50 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలా గురువారం (ఏప్రిల్ 02) అర్ధరాత్రి నుంచే మరో కొత్త సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఇదొక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. యూత్ ఆడియన్స్ ను రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచిగానే కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఐఎమ్‌డీబీలోనూ ఈ సినిమాకు 8.2 రేటింగ్ ఉండడం గమనార్హం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన, ఫుట్ పాత్ పై పడుకున్న వాళ్లపై నుంచి బైక్ వెళ్లడం లాంటి రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ రిచ్ ఫ్యామిలీకి చెందిన చైత్ర అనే అమ్మాయి ఐఏఎస్ కావాలని కలలు కంటుంది. ఆ దిశగా ప్రిపేర్ అవుతుంది. ఓరోజు తన మిత్రురాలు పార్టీకి పిలవడంతో తల్లిదండ్రుల అనుమతితో పబ్ కు వెళ్తుంది. అక్కడ ఒక గ్యాంగ్ ఛైత్రపై కన్నేస్తారు. కారులోనే ఆమెను రేప్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కేసును సిటీ కమిషనర్ జయదేవ్ ఎలా సాల్వ్ చేశారు? నిందితురాలి తల్లే ఎందుకు కోర్టుకు వెళ్లింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా యుఫోరియా. సీనియర్ నటి భూమిక చావ్లా కీలక పాత్ర పోషించింది. అలాగే ధురంధర్, ధురంధర్ 2 సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సారా అర్జున్ ఈ మూవీలో ఛైత్ర అనే అత్యాచార బాధితురాలిగానటించింది. అలాగే విఘ్నేష్, గౌతమ్ మీనన్, రవి ప్రకాశ్, కల్పలత, లిఖిత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీమతి రాగిణి గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన యుఫోరియా సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో యుఫోరియా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో యుఫోరియా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us