AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Dorababu: కొత్తింట్లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ దొరబాబు.. సందడి చేసిన హైపర్ ఆది.. వీడియో

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దొరబాబు కూడా ఒకడు. హైపర్ ఆది టీంలో మెంబర్ గా కొనసాగుతోన్న అతను తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ నటుడు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు.

Jabardasth Dorababu: కొత్తింట్లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ దొరబాబు.. సందడి చేసిన హైపర్ ఆది.. వీడియో
Jabardasth Dorababu
Basha Shek
|

Updated on: May 06, 2026 | 8:09 AM

Share

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన దొరబాబు సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. మొదట పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హైపర్ ఆది టీంలో చేరి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పంచ్ డైలాగులతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే చేరువయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తున్నాడు దొరబాబు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. తాజాగా ఈ జబర్దస్త్ కమెడియన్ కొత్తింట్లోకి అడుగు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. చాలా సంప్రదాయబద్ధంగా ఈ గృహప్రవేశ కార్యక్రమం జరిగిందని తెలుస్తుంది. జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైపర్ ఆది,ఫైమా, పొట్టి నరేష్ ల్లెట్ భాస్కర్ వంటి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. దొరబాబు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

దొరబాబు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అమూల్య అనే యాంకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ జబర్దస్త్ కమెడియన్ . ప్రస్తుతం ఈ దంపతులకు క కుమార్తె ఉంది. కాగా ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ షోకు దూరమైనప్పటికీ దొరబాబు మాత్రం అలాగే కొనసాగుతున్నాడు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేస్తున్నాడు. అన్నట్లు దొరబాబు బిజినెస్ లోనూ రాణిస్తున్నాడు. ఆ మధ్యన శ్రీనిక అనే పేరుతో రెస్టారెంట్ బిజినెస్ కూడా రన్ చేశాడు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో జబర్దస్త్ దొరబాబు.. వీడియో ఇదిగో..

కాగా జబర్దస్త్ దొరబాబు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు దొరబాబు దంపతులకు అభినందనలు,  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సందడి చేసిన జబర్దస్త్ కమెడియన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us