టాలీవుడ్‌లో  గ్లామరస్ క్వీన్ కానీ ఆఫర్స్ మాత్రం లేవు..

Rajeev 

05 May  2026

instagram

సినిమా ఇండస్ట్రీలో నటిగా సక్సెస్ కావాలంటే అందం, అభినయం ఉన్నప్పటికీ కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే.

హీరోయిన్స్ విషయంలో గ్లామర్ పాత్రతోపాటు.. సక్సెస్ అయ్యేందుకు అదృష్టం సైతం కలిసిరావాలి.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మొదటి చిత్రంలోనే బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది.

అందం, అభినయంతో కట్టిపడేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఆమె మరెవరో కాదు.. పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత వెంకీమామ, డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు. చాలా కాలం తర్వాత హిట్ అందుకుంది. 

ఇక కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ అజయ్ భూపతి నటించిన మంగళవారం చిత్రంలో నటించింది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.