AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Points Table : ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రుతురాజ్ సేన.. ఢిల్లీ పరిస్థితి ఏంటి?

IPL 2026 Points Table : న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రన్ చేజ్ చేసి గెలవడం చెన్నై ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ టీమ్, 5 విజయాలు, 5 ఓటములతో మొత్తం 10 పాయింట్లు సాధించింది.

IPL 2026 Points Table : ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రుతురాజ్ సేన.. ఢిల్లీ పరిస్థితి ఏంటి?
Csk
Rakesh
|

Updated on: May 06, 2026 | 7:47 AM

Share

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా సాగుతుండటంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఒకప్పుడు వన్‎సైడ్‎గా సాగుతుందనుకున్న టాప్-4 పోరు ఇప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతోంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘనవిజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారిపోయాయి. మొదట్లో వరుస ఓటములతో సతమతమైన చెన్నై, ఇప్పుడు వరుస విజయాలతో ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతోంది.

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై, ఢిల్లీని కేవలం 155 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే, సంజూ శాంసన్ (87 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో 17.3 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రన్ చేజ్ చేసి గెలవడం చెన్నై ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

పాయింట్ల పట్టికలో చెన్నై స్థానం

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 2 కీలక పాయింట్లు చేరాయి. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ టీమ్, 5 విజయాలు, 5 ఓటములతో మొత్తం 10 పాయింట్లు సాధించింది. అయితే, పాయింట్లు పెరిగినప్పటికీ పట్టికలో చెన్నై స్థానంలో మార్పు రాలేదు. ప్రస్తుతం సీఎస్కే 6వ స్థానంలోనే కొనసాగుతోంది. కానీ ఈ గెలుపు వల్ల నెట్ రన్ రేట్ (+0.151) గణనీయంగా మెరుగుపడింది. 12 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం చెన్నై కంటే ముందు వరుసలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతేనా?

ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే ఢిల్లీ 10 పాయింట్లతో చెన్నైని వెనక్కి నెట్టి ఆరో స్థానానికి వెళ్లేది. కానీ ఓటమి వల్ల ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో 7వ స్థానంలోనే ఉండిపోయింది. ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరాలంటే తమ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది. అలా గెలిస్తే 16 పాయింట్లతో రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఢిల్లీకి అది అంత సులభం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పట్టికలో టాప్, బాటమ్ ఎవరంటే?

ప్రస్తుత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికను గమనిస్తే.. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో (No.1) నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టాప్-4 లో కొనసాగుతున్నాయి. ఇక పట్టికలో అందరికంటే అట్టడుగున లక్నో సూపర్ జెయింట్స్ ఉంది. కేవలం 4 పాయింట్లతో ఉన్న లక్నోకు ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు మూసుకుపోయినట్లే. చెన్నై తన తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే టాప్-4 లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జానీ మాస్టర్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న నటికి ఏకంగా..
జానీ మాస్టర్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న నటికి ఏకంగా..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్