AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Yoga: చంద్రుడి కృపతో ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. జీవితంలో భారీ మార్పులు!

Chandra Yoga: మే 6 నుంచి 14 వరకు చంద్రుడు శుభస్థానాల్లో సంచారం చేయడం వల్ల చంద్ర మంగళ, గజకేసరి వంటి రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొత్త అవకాశాలు, మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 05, 2026 | 6:48 PM

Share
ఈ నెల(మే) 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చంద్రుడు ధనుస్సు నుంచి మీన రాశి వరకు సంచారం చేయడం జరుగుతుంది. శుభ దృష్టులు, శుభ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి వల్ల ఇతర యోగాలతో పాటు చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం వంటి రాజయోగాలు కూడా కలుగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకోదలచుకున్నవారికి, కొత్త ప్రయత్నాలు చేపట్టదలచుకున్న వారికి ఇది చాలా అనుకూల సమయం. చంద్రుడు మనస్సుకు కారకుడైనందువల్ల మనసులోని కోరికలు నెరవేరడం, సమస్యలు, ఒత్తిళ్లు దూరం కావడం వంటివి చోటు చేసుకుంటాయి. మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి యోగదాయకంగా గడిచిపోతుంది.

1 / 7
మేషం: ఈ రాశివారికి చతుర్ధాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

2 / 7
వృషభం: ఈ రాశివారు ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా ఫలిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించి, జీవితంలో ఆశించిన విధంగా స్థిరపడడం జరుగుతుంది. విదేశీయానానికి అవకాశాలున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.

3 / 7
కర్కాటకం: రాశినాథుడు చంద్రుడి అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ పూర్తవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. స్థిరమైన ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

4 / 7
తుల: దశమాధిపతి చంద్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కార మవుతాయి. బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

5 / 7
మకరం: ఈ రాశివారు చంద్రుడి అనుకూలత వల్ల ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్ప కుండా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి, వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధించడానికి, కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. సంతాన యోగం పట్టే అవకాశం కూడా ఉంది.

6 / 7
మీనం: ఈ నెల 14 వరకు ఈ రాశివారికి చంద్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. గృహ, వాహన యోగాలు పడ తాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంటుంది. ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఒకటి రెండు కీలక వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.

7 / 7
Follow Us
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..

మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ