AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apartment: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.? ఇది చాలామందికి తెలియదు..

సొంత ఇల్లు అనేది ఒక భావోద్వేగం.. కానీ అది ఒక లాభదాయకమైన పెట్టుబడేనా? అపార్ట్‌మెంట్ కొంటే 20 ఏళ్ల తర్వాత దాని పరిస్థితి ఏంటి? కోటిన్నరతో ఫ్లాట్ కొనే బదులు ఎస్ఐపీ(SIP) చేస్తే కోట్లు వస్తాయా? ఇల్లు కొనాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నవారికి ఈ వివరాలు..

Apartment: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.? ఇది చాలామందికి తెలియదు..
Apartment
Ravi Kiran
|

Updated on: May 06, 2026 | 7:43 AM

Share

ప్రతి సామాన్యుడి జీవిత ఆశయం ఒక సొంత ఇల్లు. అయితే, నేటి వేగవంతమైన ప్రపంచంలో “ఇల్లు ఒక డెడ్ ఇన్వెస్ట్‌మెంట్” అని కొందరు, “సొంతింటి సుఖమే వేరు” అని మరికొందరు వాదిస్తుంటారు. ఈ నేపథ్యంలో బిజినెస్ నిపుణులు ఇచ్చిన సలహా ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఇల్లు కొనడం అనేది కేవలం ఆర్థిక పరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక సామాజిక, మానసిక నిర్ణయం అని స్పష్టం చేశారు. ఒక కోటిన్నర పెట్టి ఫ్లాట్ కొనే బదులు, ఆ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో కాకుండా నెలకు లక్ష రూపాయల చొప్పున SIP చేస్తే, 20 ఏళ్ల తర్వాత అది దాదాపు 7 నుంచి 8 కోట్లు అవుతుందని బిజినెస్ నిపుణులు వివరించారు. అదే సమయంలో కోటిన్నర పెట్టి కొన్న ఫ్లాట్ విలువ 20 ఏళ్ల తర్వాత తరుగుదల కారణంగా 2-3 కోట్లు మాత్రమే ఉండవచ్చు. అంటే కేవలం డబ్బు పరంగా చూస్తే SIP బెస్ట్ ఆప్షన్ అన్నారు. కానీ, జీవితం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమేనా? అని ప్రశ్నించారు.

ప్రస్తుత యువతలో కనిపిస్తున్న DINK (Double Income No Kids) సంస్కృతిపై స్పందిస్తూ.. కేవలం భార్యాభర్తలు మాత్రమే ఒక సర్కిల్‌లో బతకడం జీవితం కాదని, కుటుంబం, బంధువులతో కలిసి సుఖదుఃఖాలను పంచుకోవడమే అసలైన జీవనమని అభిప్రాయపడ్డారు. సొంత ఇంట్లో ఉండే భద్రతా భావం, ముఖ్యంగా వృద్ధాప్యంలో లేదా కష్టకాలంలో ఇచ్చే మానసిక ధైర్యం అద్దె ఇల్లు ఇవ్వలేదు. తల్లిదండ్రులు మరణించినప్పుడు అద్దె ఇంట్లో ఉండేవారు ఎదుర్కొనే ఇబ్బందులు డబ్బుతో వెలకట్టలేనివని గుర్తు చేశారు.

ఇక ఇండిపెండెంట్ హౌస్ vs ఫ్లాట్ విషయానికి వస్తే.. ఇండిపెండెంట్ ఇంటికి భూమి విలువ పెరుగుతుంది కానీ, ఆ ఆస్తిని నగదుగా మార్చుకోవడం కష్టం. నేటి పిల్లలు భవిష్యత్తులో మనం కట్టిన పెద్ద ఇంట్లో ఉంటారనే గ్యారెంటీ లేదు. అందుకే, మరీ భారీ బడ్జెట్‌కి వెళ్లకుండా, ఒక రీజనబుల్ ఫ్లాట్ కొనుగోలు చేసి, మిగిలిన ఆదాయాన్ని పిల్లల చదువులకు, రిటైర్మెంట్‌కు, విహారయాత్రలకు బ్యాలెన్స్ చేసుకోవడం ఉత్తమమని సూచించారు. “జీవితం అంటే కేవలం దాచుకోవడం కాదు.. జీవించడం” అనే సూత్రాన్ని వినిపించారు.

Follow Us
టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!
టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!
11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..
11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..