AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: ‘మీ అమ్మ ఆపరేషన్‌ ఖర్చు మొత్తం నేనే భరిస్తా’.. కష్టాల్లో నటికి అండగా నిలిచిన జానీ మాస్టర్

తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై వేధింపులకు పాల్పడ్డాడని జానీ మాస్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొద్ది రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా అనుభవించారు జానీ మాస్టర్. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు.

Jani Master: 'మీ అమ్మ ఆపరేషన్‌ ఖర్చు మొత్తం నేనే భరిస్తా'.. కష్టాల్లో నటికి అండగా నిలిచిన జానీ మాస్టర్
Jani Master
Basha Shek
|

Updated on: May 06, 2026 | 7:55 AM

Share

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉంది. అయితే గత ఏడాది కొన్ని కేసులు, వివాదాలతో జానీ మాస్టర్ పేరు మసకబారిపోయింది. తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మాస్టర్ పై కేసులు కూడా నమోదయ్యాయి. కొద్ది రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా అనుభవించారాయన. ఇందులో నిజ నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జానీ మాస్టర్ మళ్లీ తన ప్రొఫెషనల్ వర్క్ లో బిజీ అవుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాగే బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అందులో జెమినీ టీవీలో ప్రసారమవుతోన్న మాస్ జాతర షో కూడా ఉంది. తాజాగా ఈ షోలో ఓ ఆర్టిస్ట్‌కి వచ్చిన కష్టాన్ని తెలుసుకుని, అడిగి మరీ సాయం చేశారు జానీ మాస్టర్.

వివరాల్లోకి వెళితే.. ఈ షోలో భాగంగా ఓ ఆర్టిస్ట్ పర్ఫామెన్స్ చేసే టైంలో ఏదో బాధలో ఉందని జానీ మాస్టర్ గమనించారు. ‘ ఏం జరిగింది అమ్మా.. ఎందుకు అంత డల్‌గా ఉన్నారు’ అని జానీ మాస్టర్ అడిగి మరీ నటి సమస్యను తెలుసుకున్నాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్న సదరు నటి తన ఇంట్లోని ఇంట్లోని సమస్య, ఆరోగ్య సమస్యల గురించి చెప్పింది. ‘ మా అమ్మకి ఆపరేషన్ చేయించాల్సి ఉంది. చేతిలో డబ్బులు లేక ఆలస్యం అవుతోంది. నా దగ్గర ఆల్రెడీ లక్షన్నర ఉంది. ఇంకా యాభై వేలు అవసరముంది’ అంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో జానీ మాస్టర్ వెంటనే ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ‘ఇంకెంత కావాలి.. యాభై వేలు.. ఆ లక్షన్నర కూడా నీ దగ్గరే పెట్టుకో.. నేనే రెండు లక్షలు ఇస్తాను. అమ్మకి ఏమీ కాదు.. మా అందరి ప్రేమ ఆమెతో ఎప్పటికీ ఉంటుంది.. ఆమెకీ ఏమీ కాదు’ అంటూ సదరు నటిక భరోసా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జానీ మాస్టర్ చేసే సాయాన్ని అంతా అభినందిస్తున్నారు. కాగా ప్రస్తుతం జానీ మాస్టర్ రామ్ చరణ్ పెద్ది సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఆయన కొరియోగ్రఫీ చేసిన చికిరి సాంగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జానీ మాస్టర్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న నటికి ఏకంగా..
జానీ మాస్టర్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న నటికి ఏకంగా..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్