AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా పోస్టర్ చూసి ఇండస్ట్రీలోకి.. అవకాశలకోసం తిరుగుతూ హోటల్ పని.. ఇప్పుడు ఇలా

సినిమాల్లోకి రావాలని కల కంటూ ఉంటారు. ఆ కలను నెరవేర్చుకోవాలని ఎంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంటారు ఉంటారు. కొంతమంది అవకాశాలు అంత సులభంగా రావు. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కున్నాకే ఎంతో మంది స్టార్స్ అయ్యారు. వారిలో ఈ నటుడు ఒకరు.

సినిమా పోస్టర్ చూసి ఇండస్ట్రీలోకి.. అవకాశలకోసం తిరుగుతూ హోటల్ పని.. ఇప్పుడు ఇలా
Tollywood Actor
Rajeev Rayala
|

Updated on: Apr 27, 2026 | 12:36 PM

Share

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు ధనరాజ్. జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ధనరాజ్. తన కామెడీతో ఎంతో మందిని నవ్వించాడు ధనరాజ్. జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ రాణించాడు. ఇటీవలే దర్శకుడిగా మారి రామంరాఘవం అనే సినిమా తెరకెక్కించాడు ధనరాజ్.  ధనరాజ్ సినీ రంగ ప్రవేశానికి ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన తన బాల్యం నుండి సినీ పరిశ్రమలోకి ప్రవేశించే వరకు ఎదుర్కున్న సవాళ్లను పంచుకున్నాడు. ధనరాజ్ తన 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న రోజునే హనుమాన్ జంక్షన్లోని తన ఇంటి నుండి పారిపోయి హైదరాబాద్‌కు వచ్చాడు. తన తండ్రిది తాడేపల్లిగూడెం కాగా, తల్లిది హనుమాన్ జంక్షన్ అని ఆయన తెలిపాడు. లారీ ఎక్కి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద దిగి, అక్కడి నుండి సికింద్రాబాద్ చేరుకొని, చివరికి ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోకు వచ్చాడట. అక్కడి నుంచే తన సినీ ప్రయాణం ప్రారంభమైందని ఆయన తెలిపాడు.

ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?

చిన్నతనంలో సినిమా పోస్టర్లు చూసి చిత్ర పరిశ్రమ గురించి తెలుసుకున్న ధనరాజ్, పోస్టర్‌పై పెద్ద పేర్లు దర్శకులవని, ఇంకా పెద్ద పేర్లు నిర్మాతలవని, చిన్నవి సంగీత దర్శకులవని, అంతకన్నా చిన్నవి ఫైట్ మాస్టర్‌లవని అక్కడే నేర్చుకున్నాడట. అప్పట్లో సినిమాలపై ఉన్న క్రేజ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ముఖ్యంగా చిరంజీవి నటించిన “యముడికి మొగుడు” సినిమా పోస్టర్ తనను సినీ పరిశ్రమలోకి రావాలని బలంగా ప్రేరేపించిందని ఆయన గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి నటులందరూ ఒకే చోట ఉంటారని, వెళ్ళగానే ఎవరో ఒకరు అవకాశం ఇస్తారని భావించినట్లు ధనరాజ్ తెలిపాడు. కానీ, హైదరాబాద్ వచ్చాక సినిమా తారల ఇళ్లు వేర్వేరు ప్రాంతాలలో ఉన్నాయని, అద్దె ఇళ్లలో కూడా ఉంటారని తెలిసి తన భ్రమలు తొలగిపోయాయని అన్నాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న సుమారు 400 రూపాయలు అయిపోయిన తర్వాత, ధనరాజ్ జీవనం కోసం ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఉన్న కాకతీయ మెస్‌లో పనిచేశారట. ఉదయం ఆఫీసులు తిరిగి, మధ్యాహ్నం 2:30 గంటలకు లంచ్ అవర్ సమయంలో హోటల్‌లో పని చేసేవాడిని, అక్కడే భోజనం చేసి, అక్కడే ఉండేవాడిని తెలిపాడు.

ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే

ఐదు రూపాయల ఫోటో కోసం డబ్బులు అడుక్కుని, వెనుక హైట్, వెయిట్, అడ్రస్ రాసి అవకాశాల కోసం తిరిగి, ఒక ఆఫీసులో ఇచ్చిన తన ఫోటోను మరుసటి రోజు డస్ట్ బిన్‌లో చూడటం తనను కలచివేసిందని పేర్కొన్నాడు. తన ఫోటో మాత్రమే కాకుండా, ఇప్పుడు స్టార్స్‌గా ఉన్న చాలామంది ఫోటోలు కూడా డస్ట్ బిన్‌లో ఉండేవని ఆయన తెలిపాడు. ఆ తర్వాత విజయ్ మాస్టర్ అనే వ్యక్తి “సూపర్ స్టార్స్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్” అనే యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాడట. ధనరాజ్ అక్కడే ఉంటూ, ఇన్‌స్టిట్యూట్‌లో మిగతా విద్యార్థులకు కాఫీ, టీ అందిస్తూ పని చేస్తూ, 7,500 రూపాయల ఆరు నెలల కోర్సును ఉచితంగా నేర్చుకున్నాడట. సత్యం ఆబీ అనే యాక్టింగ్ మాస్టర్ వద్ద శిక్షణ పొంది, ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకున్నాడట ధనరాజ్. అక్కడే డాన్స్ కూడా నేర్చుకున్నా అని తెలిపాడు. తేజ దర్శకత్వం వహించిన జై సినిమా కోసం కొత్తవారితో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలియగానే, ధనరాజ్ తన ఫోటోలను పంపించాడట. కాల్ లెటర్ రాగానే, తన ఒక్కడికే వచ్చిందని భావించి అక్కడికి వెళ్ళగా, అక్కడ దాదాపు 10,000 మంది ఉన్నారని. రామానంద్ అనే వ్యక్తి ఈ ఆడిషన్స్ నిర్వహించగా, ఎంతో మందిని వడపోసిన తర్వాత కేవలం 10 మందికి అవకాశం లభించిందని. ఆ పది మందిలో నవదీప్, గీతా సింగ్, వేణు, చంద్ర, హర్షవర్ధన్‌తో పాటు నేను ఒకడిని అని తెలిపాడు ధనరాజ్. ఇలా తన సినీ కెరీర్ మొదలైందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us