Jabardasth Chanti: నన్ను ఇలా చేసినవాడి నాశనం చూశాకే చస్తా.. చలాకి చంటి ఎమోషనల్ కామెంట్స్..
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎంతోమంది హాస్యనటులకు జీవితాన్నిఇచ్చింది. ఈ షో ద్వారా కమెడియన్లుగా సినీరంగంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉంటున్నారు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన హాస్యనటులు చాలా మంది ఉన్నారు. అందులో కమెడియన్ చలాకీ చంటి ఒకరు. తన చలాకీతనం.. కామెడీ టైమింగ్ తో.. తన స్టైల్లో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ఈ షో ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. అలాగే సినిమాల్లో హాస్యనటుడిగా అలరించాడు. ఎప్పుడూ తన కామెడీ స్క్రిప్టులతో ప్రేక్షకులను మెప్పించిన చలాకీ చంటి.. ఆకస్మాత్తుగాసినిమాకు దూరమయ్యాడు. అదే సమయంలో గుండెకు సంబంధిత అనారోగ్యంతో చంటి ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత కోలుకుని తిరిగి వచ్చాడు. కానీ సినిమాలకు , బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇదెలా ఉంటే.. చలాకీ చంటి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
సినీరంగంలో తనకు చాలా మందితో పరిచయం ఉందని.. కానీ తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు పలకరించలేదని అన్నారు. డబ్బు ఉంటేనే ఈలోకం పలకరిస్తుందని..చివరకు మనం పెంచుకున్న కుక్క అయినా సరే దానికి రోజూ చికెన్, మటన్ తినిపిస్తేనే వచ్చి తోక ఊపుతుందని చెప్పుకొచ్చాడు. తాను జబర్దస్త్ లో ఉండి.. అటు సినిమాల్లోనూ ఈవెంట్లు స్కిట్లలో బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు అందరూ తన చుట్టూ ఉండేవారిని.. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకడు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
ఎంత కష్టమైనా, నష్టమైనా డబ్బు సంపాదిస్తున్నట్లు కనిపించాలని.. లేకపోతే ఎవరూ పట్టించుకోరని.. దేనికి పిలవరని అన్నారు. ఇది కలియుగమని.. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలు లేదని అన్నారు. తనకు ఈగో ఎక్కువ అని షూటింగ్ కు వస్తే చాలా డబ్బు తీసుకుంటానని కొంతమంది తన గురించి నెగిటివ్ గా ప్రచారం చేశారని.. తనకు సంబంధం లేని గొడవల్లో తన పేరు ఇరికించి అవకాశాలు రాకుండా చేశారని .. తన గురించి అలా ప్రచారం చేసినవారు సర్వనాశనమవుతారని.. వారి నాశనం చూశాకే చస్తానని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం చలాకీ చంటి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
