Bro Movie: ‘బ్రో’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ రొమాంటిక్ సాంగ్..
ఈ సినిమా ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ సిత్తం చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సముద్రఖని. మంచి బజ్ తోపాటు.. అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి గతంలో ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తోన్న సినిమా బ్రో. మొదటిసారి వీరిద్దరి కాంబో వస్తోన్న ఈ మూవీ కోసం తెలుగు రాష్ట్రాల్లోని మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇందులో మరోసారి దేవుడి పాత్రలో పవన్ అలరించనుండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుతగా చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ సిత్తం చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సముద్రఖని. మంచి బజ్ తోపాటు.. అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి గతంలో ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ జాణవులే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మొదటి పాటకు కాస్త్ మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు విడుదలైన జాణవులే సాంగ్ ఆకట్టుకుంటుంది. సాయి తేజ్, కేతిక శర్మ మధ్య ఈ రొమాంటిక్ సాంగ్ ఉండనుంది. ఈ చిత్రానికి సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
సెకండ్ సింగిల్ పాటకు క్యాచీ ట్యూన్ అందించాడు తమన్. ఇక చాలా రోజుల తర్వాత తన వోకల్స్ లో పాడడం బాగుంది. మొత్తానికి తాజాగా విడుదలైన జాణవులే సాంగ్ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఇటీవలే డబ్బింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూలై 28న అడియన్స్ ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జీ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కేతికతోపాటు.. ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



