Mahesh Babu: మహేష్- త్రివిక్రమ్ సినిమా కథ ఇదేనా..? అందుకే మహేష్ బీస్ట్ లుక్ లోకి మారారా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటించిన సర్కారు వారి పాట సినిమా రీసెంట్ గా 100 డేస్ పూర్తి చేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటించిన సర్కారు వారి పాట సినిమా రీసెంట్ గా 100 డేస్ పూర్తి చేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ హింట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సరిపోలేదు. మహేష్ నుంచి ఓ భారీ హిట్ ను ఎక్స్పెట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత మహేష్ , గురూజీ కాంబినేషన్ లో సినిమా వస్తోంది.దాంతో మహేష్ అభిమానులంతా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతడు, ఖలేజా సినిమాలకు బిన్నంగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఇదే అంటూ ఇప్పుడు ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ ఈ సినిమాలో స్పెషల్ ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్. ఇందుకోసమే మహేష్ రఫ్ లుక్ లోకి మారారని అంటున్నారు. ఇక ఇటీవలే మహేష్ షర్ట్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ ఏజెంట్ పాత్ర కోసమే కండలు పెంచి బీస్ట్ లుక్ లోకి మారారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్.