Ram Gopal Varma: కుర్రహీరో సినిమా పై ఆర్జీవీ సంచలన కామెంట్స్.. కార్తికేయ2ను ఆ రెండు సినిమాలతో పోల్చిన వర్మ

క్రిటిసిజమ్‌లో పీహెచ్‌డీ చేసేసిన వాడిలా మాట్లాడే వర్మ.. తాజాగా తన రూట్ మార్చుకున్నారు. ఓ చిన్న సినిమాను.. కాదు కాదు.. పాన్ ఇండియాను షేక్ చేస్తున్న సినిమాను తాజాగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma: కుర్రహీరో సినిమా పై ఆర్జీవీ సంచలన కామెంట్స్.. కార్తికేయ2ను ఆ రెండు సినిమాలతో పోల్చిన వర్మ
Film Director Ram Gopal Varma
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2022 | 4:44 PM

క్రిటిసిజమ్‌లో పీహెచ్‌డీ చేసేసిన వాడిలా మాట్లాడే వర్మ(Ram Gopal Varma).. తాజాగా తన రూట్ మార్చుకున్నారు. ఓ చిన్న సినిమాను.. కాదు కాదు.. పాన్ ఇండియాను షేక్ చేస్తున్న సినిమాను తాజాగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. మార్నింగ్ తన ట్వీట్తో ఒక్క సారిగా అందర్నీ షాక్ చేశారు ఆర్జీవీ. కార్తికేయ మూవీ టీంకు పట్టరాని ఆనందం వచ్చేలా చేశారు. ఎప్పుడూ తన ట్వీట్లతో.. మాటలతో అందర్నీ మడతేసే వర్మ.. తాజాగా కార్తికేయ2 సక్సెస్ పై కూడా ట్వీట్ చేశారు. రాజమౌళి పాన్ ఇండియన్ ఫిల్మ్ ట్రిపుల్ఆర్‌.. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కేజీఎఫ్ 2 తో పోల్చి మరీ.. కార్తికేయ 2 బిగ్గెస్ట్ హిట్‌ అంటూ డిక్లేర్‌ చేశారు.

అంతేకాదు.. బాలీవుడ్ బడా హీరోలైన అమీర్ ఖాన్ లాల్‌ సింగ్ చడ్డా, అక్షయ్‌ రాఖీ బందన్ సినిమాల కలెక్షన్లను.. అప్పటికే డబుల్‌ అయిన కార్తికేయ2 సినిమా కలెక్షన్‌లను తన ట్వీట్లో కోట్ చేశారు. హాట్సాఫ్ అంటూ.. హీరో నిఖిల్‌ను, డైరెక్టర్ చందూను, ప్రొడ్యూసర్ అఖిలేష్‌ను అభినందించారు కూడా..! ఇక కార్తికేయ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో సూపర్ సక్సెస్ గా దూసుకుపోతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. కృష్ణతత్వం గురించి వివరిస్తూ ఈ సినిమా కథ సాగుతుంది. ఇక ఈ సినిమా లో నేషనల్ అవార్డు విన్నర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి