Waltair Veerayya : మెగాస్టార్ మాస్ మాసాల మూవీ వాల్తేరు వీరయ్య స్టోరీ ఇదేనా..

ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఈ క్రమంలోనే చిరు వాల్తేరు వీరయ్య అనే మాస్ మసాలా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Waltair Veerayya : మెగాస్టార్ మాస్ మాసాల మూవీ వాల్తేరు వీరయ్య స్టోరీ ఇదేనా..
Waltair Veerayya
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2022 | 5:08 PM

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గాడ్ ఫాదర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయినా కూడా ఎక్కడ కూడా ఇది రీమేక్ అని అనిపించకుండా తెరకెక్కించి ఆకట్టుకున్నారు మోహన్ రాజా. అలాగే మెగాస్టార్ కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఈ క్రమంలోనే చిరు వాల్తేరు వీరయ్య అనే మాస్ మసాలా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ , టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చిరు మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజ రవి తేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ సినిమాలో రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించనున్నారట. సత్యరాజ్ కు ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య కొడుకు చిరంజీవి, రెండో భార్య కొడుకు రవితేజ మధ్య చిన్నప్పటి నుంచి గొడవలు జరుగుతుంటాయట.. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ స్మగ్లర్ పాత్రలో కనిపిస్తారట. అలాగే రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు.

ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ మెగాస్టార్ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.

ఇవి కూడా చదవండి
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!