Hanu Raghavapudi: సీతారామం దర్శకుడు నెక్స్ట్ చేసేది ఆ హీరోతోనే.. బంపర్ ఆఫర్ కొట్టేశాడుగా..
యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమ కథను చాలా చక్కగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.

రీసెంట్ డేస్ లో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో సీతారామం సినిమా ఒకటి. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమ కథను చాలా చక్కగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు. అయితే సాలిడ్ సక్సెస్ మాత్రం సీతారామం సినిమాతోనే అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ తమ నటనతో కటిపడేశారు. అలాగే సీతారామం సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించి మెప్పించింది.
ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి ఎవరితో సినిమా చేస్తున్నారన్నదని పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే వరల్డ్ వార్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీ చేయాలని ఉందని గతంలో చెప్పారు హను రాఘవపూడి. అయితే ఈ సినిమాను తమిళ్ హీరో సూర్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కార్తిలలో ఒకరితో సినిమా చేయాలని అనుకున్నాడు.
కానీ ఆ హీరోల డేట్స్ దొరక్కపోవడంతో ప్రభాస్ తో సినిమా చేయాలని చూస్తున్నారట. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే హను రాఘవపూడి ప్రభాస్ కి కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. సీతారామం సినిమా మేకింగ్ కు ఫిదా అయిన ప్రభాస్ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.




