AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: బంపర్ ఆఫర్ కొట్టేసిన కమెడియన్… ప్రభాస్ సినిమాలో యోగిబాబు

స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా యోగిబాబు నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా యోగిబాబు సుపరిచితుడే.. శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో నటించాడు యోగి బాబు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే దళపతి వారసుడు సినిమాలోనూ నటించాడు. ఇక ఇప్పుడు యోగిబాబు డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించనున్నాడని తెలుస్తోంది.

Prabhas: బంపర్ ఆఫర్ కొట్టేసిన కమెడియన్... ప్రభాస్ సినిమాలో యోగిబాబు
Prabhas
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2023 | 11:26 AM

Share

తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యోగిబాబు. కమెడియన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు యోగిబాబు. స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా యోగిబాబు నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా యోగిబాబు సుపరిచితుడే.. శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో నటించాడు యోగి బాబు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే దళపతి వారసుడు సినిమాలోనూ నటించాడు. ఇక ఇప్పుడు యోగిబాబు డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించనున్నాడని తెలుస్తోంది. యోగిబాబు కు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.  టాలీవుడ్ లో యోగి బాబు ఓ బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని టాక్ వినిపిస్తుంది.

యోగిబాబు ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో యోగిబాబు నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పై ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారుతీ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా యోగిబాబు కూడా నటిస్తున్నారని టక వినిపిస్తుంది. ప్రభాస్, యోగిబాబు కాంబినేషన్స్ లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?