Gopichand Malineni: గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనేనా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన సినిమాలో వీరసింహారెడ్డి ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ నటన.. గోపీచంద్ మలినేని దర్శకత్వం ఈ సినిమాను భారీ విజయం వైపు నడిపించాయి. ప్రస్తుతం ఓటీటీలో వీరసింహారెడ్డి సినిమా సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో గోపీచంద్ క్రేజ్ పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు.. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ స్టార్ హీరోతో గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది.
ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలను కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో గోపీచంద్ మలినేనితో కూడా చిరంజీవి సినిమా ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసి రెడీగా ఉన్నాడట గోపిచంద్. బాస్ ఓకే అంటే పట్టాలెక్కించడమే అని టాక్.
మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. భోళాశంకర్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.




