అందాల అనుపమ.. లవ్ ఏమైందీ?
లవ్ మేటర్‌లో అనుపమ డకౌట్ అయ్యిందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మొన్న ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నపుడు అనుపమ పేరు మార్మోగింది. అయితే .. ఈ విషయంలో నో కామెంట్ అంటోంది. అంటే ఆ క్రికెటర్‌తో లవ్ ఉన్నట్టా? లేనట్టా? ఇండియన్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా బౌలింగ్‌కి ఎదుటి జట్ల బ్యాట్స్‌మెన్ వికెట్లు పడేసుకుంటారు. అందాల భామ అనుపమ అతని కరిష్మాకి తన మనసును పడేసుకుందట. ఇందులో నిజమెంత అన్న విషయంలో క్లారిటీ లేదు. […]

లవ్ మేటర్‌లో అనుపమ డకౌట్ అయ్యిందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మొన్న ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నపుడు అనుపమ పేరు మార్మోగింది. అయితే .. ఈ విషయంలో నో కామెంట్ అంటోంది. అంటే ఆ క్రికెటర్‌తో లవ్ ఉన్నట్టా? లేనట్టా? ఇండియన్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా బౌలింగ్‌కి ఎదుటి జట్ల బ్యాట్స్‌మెన్ వికెట్లు పడేసుకుంటారు. అందాల భామ అనుపమ అతని కరిష్మాకి తన మనసును పడేసుకుందట. ఇందులో నిజమెంత అన్న విషయంలో క్లారిటీ లేదు. కానీ చాలా కాలంగా ఈ మేటర్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ మేటర్‌లో లిప్స్‌ను లాక్ చేసింది. తాజాగా రాక్షసుడు అనే సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు జర్నలిస్టులంతా ఇదే విషయాన్నిఅమెను అడిగారు. అయితే ఆమె ఇచ్చిన సమాధానం చాల విచిత్రంగా ఉంది.
బూమ్రా విషయాన్ని జర్నలిస్ట్‌లు ప్రస్తావన తీసుకురాగానే దాని గురించి అడగొద్దు.. అంటూ రియాక్ట్ అయ్యింది. ఆ మేటర్‌లో నేను ఏమీ మాట్లాడను అంది. అలాంటిదేమీ లేదు అని చెప్పలేదు. అలాగని ఉందని కూడా చెప్పలేదు. చాలా విచిత్రంగా దాని గురించి మాట్లాడను అని మాత్రమే సమాధానమిచ్చింది. మరి దీని అర్ధం ఏమిటో?
అనుపమ తక్కువ టైమ్‌లోనే హీరోయిన్‌గా సక్సెస్ అయ్యింది మాత్రం మన తెలుగునాట. తెలుగులో త్రివిక్రమ్ తీసిన ఆఆ , ప్రేమం, శతమానం భవతి సినిమాలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆతర్వాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం, ఇంటిలిజెంట్ వంటి సినిమాలు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. దాంతో ఆమె క్రేజ్ కొంత తగ్గింది. సినిమాలు కూడా తగ్గాయి. ఈ గ్యాప్‌లోనే ఆమె క్రికెటర్‌కి మనసు ఇచ్చేసిందా? అన్నది అందరిలోనూ డౌట్