Ippudu Kaka Inkeppudu: తొలి సినిమా అందుకే పొరపాటు.. కావాలని చేయలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు వ్యతిరేక ఆరోపణలు రావడం కామన్. ఇప్పటికే చాలా సినిమాల విషయాల్లో చిత్ర దర్శకులకు అనుకొని ఇబ్బందులు

Ippudu Kaka Inkeppudu: తొలి సినిమా అందుకే పొరపాటు.. కావాలని చేయలేదు.. వివాదంపై  క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Ippudu Kaka Inkeppudu
Follow us

|

Updated on: Aug 06, 2021 | 10:10 AM

సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు వ్యతిరేక ఆరోపణలు రావడం కామన్. ఇప్పటికే చాలా సినిమాల విషయాల్లో చిత్ర దర్శకులకు అనుకొని ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. స్టార్ హీరోల చిత్రాలకు సైతం ఇలాంటి తలనొప్పులు ఎదురయ్యాయి. ఒకనొక సమయంలో సినిమా విడుదలకు కొద్ది గంటల ముందే టైటిల్ మార్చిన సందర్భాలు ఉన్నాయి. గత రెండు రోజుల కిందట చిన్న సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ మూవీ ట్రైలర్‏లో అభ్యంతరకర సన్నివేశాలలో హిందూ దేవుడికి సంబంధించిన మ్యూజిక్ ప్లే చేసారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ సినిమా నుంచి పలు సన్నివేశాలను తొలగించాలని కోరుతూ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిత్రయూనిట్‏కు 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి.. నోటీసులు కూడా పంపారు. దీంతో సినిమా డైరెక్టర్ వై. యుగంధర్ క్షమాపణ చెప్పారు.

చిత్రదర్శకుడు వై. యుగంధర్‌ మాట్లాడుతూ..డైరెక్టర్ బాపు, వాసుగార్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసి దర్శకత్వం పై అవగాహన పెంచుకుని.. తొలి ప్రయత్నంతో ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా తీశాను. ఈ మూవీకి ముందే స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు కథలు రాసుకున్నాను.. కానీ ఇప్పటికీ కుదరలేదు. అందుకే దర్శకుడిగా నన్ను నేను రుజువు చేసుకోవడానికి కొత్తవాళ్లతో ఈ సినిమా ట్రై చేశాను. మా సినిమా టీజర్‌ విడుదల తర్వాత కొన్ని వివాదాలు వచ్చాయి. తొలి సినిమా కావడంతో పొరపాటు జరిగింది. కావాలని చేయలేదు. ప్రస్తుతం నా దగ్గర ఆరు కథలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు ? అని తొందరపడి చేసే పనులు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురిచేస్తాయని చెప్పడానికి ఈ సినిమా చేశామన్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న సున్నితమైన అంశాన్ని ఈ సినిమా రూపంలో చూపించాను అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ యుగంధర్. హశ్వంత్‌ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్‌ గౌడ, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఈరోజు విడుదల కానుంది. ఈ చిత్రాన్ని చింతా రాజశేఖర్‌ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ నిర్మించారు.

Also Read: Chathurmukham: ఆహాలో టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీ.. ‘చతుర్‏ముఖం’ తో రానున్న మంజు వారియర్..

Cheran: సినిమా సెట్‏లో పెను ప్రమాదం.. తలకు బలమైన గాయం.. అయినా షూటింగ్ ఆపని నటుడు..

Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!