SRH కెప్టెన్ తెలుగులో మాట్లాడడం విన్నారా? పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు అదరగొట్టాడుగా.. వీడియో

గతంలో హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ తెలుగులో డైలాగులు చెప్పడమే కాదు.. సోషల్ మీడియాలో రీల్స్ చేశాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడీ ఆసీస్ బ్యాటర్. ఇప్పుడు ఆ బాధ్యతను అదే దేశానికి చెందిన ఎస్ఆర్ హెచ్ ప్యాట్ కమిన్స్ తీసుకున్నాడు.

SRH కెప్టెన్ తెలుగులో మాట్లాడడం విన్నారా? పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు అదరగొట్టాడుగా.. వీడియో
Pat Cummins
Follow us
Basha Shek

|

Updated on: Apr 24, 2024 | 4:49 PM

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. భారీ స్కోర్లు చేస్తూ వరుస విజయాలు సాధిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ ఏడాది ప్లేఆఫ్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేందుకు ఎస్ఆర్ హెచ్ తమ ప్లేయర్లతో తెలుగు సినిమా డైలాగులు చెప్పించడం పరిపాటే. గతంలో హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ తెలుగులో డైలాగులు చెప్పడమే కాదు.. సోషల్ మీడియాలో రీల్స్ చేశాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడీ ఆసీస్ బ్యాటర్. ఇప్పుడు ఆ బాధ్యతను అదే దేశానికి చెందిన ఎస్ఆర్ హెచ్ ప్యాట్ కమిన్స్ తీసుకున్నాడు. తాజాగా అతను పవన్ కల్యాణ్ మేనరిజంతో అల్లు అర్జున్, మహేశ్ బాబు డైలాగులు చెపుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మొదట మహేశ్ బాబు మూవీ పోకిరి సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అనే డైలాగుతోపాటు అల్లు అర్జున్ పుష్పలోని ఫైర్ డైలాగ్ కూడా కమిన్స్ ఎంతో పర్ఫెక్ట్ గా చెప్పాడు. ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను.. కమిన్స్ అంటే క్లాస్ కాదు.. మాస్.. ఊర మాస్.. ఎస్ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్” అనే డైలాగులు కమిన్స్ బబాగా పేలాయి. ఇక వీడియో చివర్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనరిజంతో అదరగొట్టాడు ఆసీస్ కెప్టెన్. దీనికి సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీనికి ‘ప్యాట్ కమిన్స్ తెలుగులో మాట్లాడటం విన్నారా’ అని క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు లైక్‌ ల మీద లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి.

కమిన్స్ నోట తెలుగు డైలాగులు.. వీడియో ఇదిగో..

పవన్ స్టైల్ ను అనుకరిస్తోన్న కమిన్స్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.