Prabhas: అయ్య బాబోయ్.. మరోసారి రిస్క్ తీసుకుంటున్న ప్రభాస్..! డార్లింగ్ ఫ్యాన్స్ టెన్షన్..
గతంలో తన ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేసిన అదే ప్రయోగాన్ని మరోసారి చేసేందుకు రెడీ అవుతున్నారట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రజెంట్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్... ఇంత హెక్టిక్ షెడ్యూల్‌లోనూ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

గతంలో తన ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేసిన అదే ప్రయోగాన్ని మరోసారి చేసేందుకు రెడీ అవుతున్నారట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రజెంట్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్… ఇంత హెక్టిక్ షెడ్యూల్‌లోనూ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటిన ప్రభాస్ ఆ తరువాత వెంటనే రాధేశ్యామ్ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేశారు. అయితే ఈ చేంజోవర్‌ను ఆడియన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. రాధేశ్యామ్ సినిమా మరీ బ్యాడ్ కాకపోయినా… డార్లింగ్‌ను జస్ట్ లవర్ భాయ్‌గా చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపించలేదు.
రాధేశ్యామ్ ఫెయిల్యూర్ తరువాత ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయకపోవటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కూడా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలతో ఆడియన్స్ అంచనాలకు తగ్గ లైనప్‌ను సెట్ చేశారు. అంతా ఓకే అనుకుంటున్న టైమ్‌లో మరో ట్విస్ట్ ఇచ్చింది డార్లింగ్ టీమ్. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. హను డైరెక్షన్‌లో సీతారామం సినిమాను నిర్మించిన వైజయంతీ మూవీస్‌లోనే ప్రజెంట్ ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నారు డార్లింగ్. ఆ రిలేషన్‌తోనే డార్లింగ్‌కు కథ వినిపించారట హను రాఘవపూడి. ప్రభాస్‌కి కూడా కథ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.
సీతారామం సక్సెస్‌తో హను మంచి ఫామ్‌లోనే కనిపిస్తున్నా.. హను మార్క్ టేకింగ్, ప్రభాస్ ఇమేజ్‌కు సెట్ అవుతుందా అన్నదే ఇప్పుడు అభిమానులను భయపెడుతున్న విషయం. మరి డార్లింగ్ నిజంగానే హనుతో సినిమా చేస్తారా..? చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.




మరిన్ని సినిమా వార్తలు చదవండి..




