Aishwarya Rajesh: ‘ఆ పాత్ర రష్మిక కంటే నాకే బాగా సెట్ అవుతుంది’.. ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర కామెంట్స్..

డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే12న తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Aishwarya Rajesh: 'ఆ పాత్ర రష్మిక కంటే నాకే బాగా సెట్ అవుతుంది'.. ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర కామెంట్స్..
Aishwarya Rajesh
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:47 PM

ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఫర్హానా. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే12న తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పుష్ప చిత్రంలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు తనకు వచ్చి ఉంటే.. నటించేదాన్ని అని.. ఆ రోల్ తనకు బాగా సరిపోతుందని అన్నారు. అలాగే తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని.. ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది.

“వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నన్ను తెలుగువారికి దగ్గర చేసింది. ఆ తర్వాత టక్ జగదీశ్, రిపబ్లిక్ సినిమాలు చేశాను. తెలుగులో నాకు ఆఫర్స్ రావట్లేదని కాదు.. వస్తున్నాయి.. కాకపోతే మంచి పాత్రలతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఉంది. ప్రస్తుతానికి తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. ఒకవేళ నాకు పుష్పలో అవకాశం వచ్చి ఉంటే.. తప్పకుండా చేసేదాన్ని. రష్మిక బాగా నటించారు. కాకపోతే ఆ రోల్ నాకు బాగా సెట్ అవుతుందని నా నమ్మకం. అలాగే నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. ప్రేక్షకులను అలరించే విధంగా మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్ర ఏదైనా సరే దుమ్ము దులిపేయడమే ” అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.

ఇవి కూడా చదవండి

‘సినిమా చిన్నదైనా.. లేదా పెద్దదైనా.. తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరించే తీరు ప్రత్యేకంగా ఉంటుందని.. సినిమా బాగుందని చెబితే చాలు.. వాళ్లే దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇలాంటి ప్రేమను ఏ పరిశ్రమలోనూ నేను చూడలేదు. నేను నటించి డ్రైవర్ జమున సినిమాను ఆహాలో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. చేసింది నాలుగు సినిమాలే అయినా… తెలుగు వారి ప్రేమను పొందుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.