AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazriya Nazim: సోషల్ మీడియా నుంచి సడన్ బ్రేక్‌ తీసుకున్న నజ్రియా.. పార్టీ లేదా ఫాహద్‌?

సోషల్‌ మీడియా డీటాక్స్ గురించి ఈ మధ్య తరచూ చాలా మంది సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా సోషల్‌ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకున్నారు నజ్రియా నజీమ్‌.

Nazriya Nazim: సోషల్ మీడియా నుంచి సడన్ బ్రేక్‌ తీసుకున్న నజ్రియా.. పార్టీ లేదా ఫాహద్‌?
Nazriya Nazim
Janardhan Veluru
|

Updated on: May 13, 2023 | 3:08 PM

Share

సోషల్‌ మీడియా డీటాక్స్ గురించి ఈ మధ్య తరచూ చాలా మంది సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా సోషల్‌ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకున్నారు నజ్రియా నజీమ్‌. ”కొన్నాళ్ల పాటు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నాను. సోషల్‌ డీటాక్స్‌కి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. అభిమానుల ప్రేమను, సందేశాలను మిస్‌ అవుతాను. త్వరలోనే మళ్లీ కలుస్తాను” అని పోస్ట్ పెట్టారు నజ్రియా.

మలయాళంలో ఫేమస్‌ అయిన నజ్రియా తమిళంలోనూ హిట్ ఫిల్మ్స్ చేశారు. తెలుగులో నాని సరసన అంటే సుందరానికి సినిమాలో నటించారు. త్వరలోనే ప్రణవ్‌ మోహన్‌లాల్‌ సినిమాలో నటిస్తారనే వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఆ మూవీని కూడా అంగీకరించలేదని టాక్. వీటన్నిటినీ బట్టి నజ్రియా ప్రెగ్నెంట్‌ అయ్యారేమోననే అనుమానాలు వినిపిస్తున్నాయి. పార్టీ లేదా ఫాహద్‌ అంటూ నజ్రియా భర్త ఫాహద్‌ ఫాజిల్‌ని సరదాగా ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు.

అల్లు అర్జున్‌ పుష్ప మూవీలో భన్వర్‌సింగ్‌ షెకావత్‌ పాత్రలో నటించి మెప్పించారు ఫాహద్‌. ఫస్ట్ పార్ట్‌లో ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ ఫాహద్‌ చెప్పిన డైలాగులు చాలా ఫేమస్‌ అయ్యాయి. ఇప్పుడు సెకండ్‌ పార్టులో ఫాహద్‌ రోల్‌ వేరే లెవల్లో ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు డైరక్టర్‌ సుకుమార్‌.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..