Nimisha Sajayan: ‘డీఎన్‌ఏ’ హీరోయిన్ ఛాతీపై భాగంలో పచ్చబొట్టు.. ఈ టాటూకు అంత అర్థముందా?
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం డీఎన్ఏ. ఈ మూవీతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది హీరోయిన్ నిమిషా సజయన్. రియల్ లైఫ్ తో పాటు రీల్ లైఫ్ లోనూ ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ గా నటించే ఈ అమ్మడి గురించి కొన్ని ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం రండి

తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తోంది నిమిషా సజయన్. తన అందం, అభినయంతో తనకంటూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కమర్షియల్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ న్యాచురల్ యాక్టింగ్ తో దూసుకెళ్లిపోతోంది. అంతేకాదు మేకప్ లేకుండానే నటిస్తూ వరుసగా హిట్స్ అందుకుంటోంది. ఇటీవల ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన డీఎన్ఏ (తెలుగులో ఓమై బేబీ) సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. ఈ మూవీలో హీరోగా అధర్వ నటిస్తే, అతని భార్య పాత్రలో నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. దీంతో మరోసారి ఈ మలయాళ ముద్దుగుమ్మ పేరు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. కేరళకు చెందిన నిమిషా మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి తైక్వాండో సాధన చేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. ఇక హీరోయిన్ గా పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించిందీ అందాల తార. తెలుగులో నేరుగా నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, చిన్నా (తెలుగులో చిన్నా), జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి సినిమాలతో పాటు పోచర్, డబ్బా కార్టెల్ తదితర వెబ్ సిరీసులతోనూ తెలుగు ఆడియెన్స్ కు చేరువైంది.
రియల్ లైఫ్ లో ఎంతో సింపుల్ గా కనిపించే నిమిషా రీల్ లైఫ్ లోనూ మేకప్ వేసుకోనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఛాతీ పై భాగంలో సూర్యచక్రపు గుర్తుతో ఓ టాటూ ఉంటుంది. దీని వెనక ఓ అర్థముందట. అదేంటంటే.. చామన చాయ రంగులో ఉండే నిమిషా తన కెరీర్ ప్రారంభంలో వివక్ష ఎదుర్కొందట. ఇలాగే ఉంటే సినిమాలు రావు అని ముఖం మీదే చెప్పేశారట. అయితే నిమిషా మాత్రం ప్రతిభకు రంగు అడ్డం కాదు అంటూ ముందుకు సాగి సక్సెస్ అయ్యిందట. అందులో భాగంగానే ఆత్మవిశ్వాసానికి ప్రతీకగానే తన ఛాతీపై భాగంలో సూర్యచక్రం గుర్తును టాటూగా వేయించుకుందట.
నిమిషా ఇన్ స్టా గ్రామ్ ఫొటోలు..
View this post on Instagram
చీరకట్టులో ఎంత సక్కగుందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








