Allu Arjun : పట్టాలెక్కనున్న అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా.. ఎప్పటినుంచంటే..
ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో..
Allu Arjun : ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న పుష్ప రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బన్నీ చాలా డిఫరెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, పుష్పరాజ్ వీడియో, దాక్కో దాక్కో మేక.. సాంగ్ సినిమా పైన అంచనాలు పెంచేసింది. గంధపు చక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్నీ స్మగ్లర్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుంది. పుష్ప మొదటి పార్ట్‌ను ‘క్రిస్మస్’ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు బన్నీ. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. అటు వేణు వకీల్ సాబ్ సినిమాతో ఇటు బన్నీ పుష్ప సినిమాతో బిజీ అవవడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కనుంది తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ కొంతకాలం క్రితమే సిద్ధమైంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు త్వరలోనే జరపనున్నారని తెలుస్తుంది. ఐకాన్ మూవీ పూజా కార్యక్రమాలను విజయదశమి రోజున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ రెండోవారం నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారట. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోందని తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :