Pushpa 2: The Rule: హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా

ఆగస్టు 15న పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించారు.

Pushpa 2: The Rule: హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
Pushpa 2 Allu Arjun
Follow us

|

Updated on: Apr 30, 2024 | 7:47 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ ఏవైటెడ్ మూవీ పుష్ప 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించారు. అల్లు అర్జున్ యాక్టింగ్, యాటిట్యూడ్ సినిమాకే హైలైట్. బన్నీ స్లాంగ్ , యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బన్నీనటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది.

పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇంత కాలం పాన్ ఇండియా సినిమాలు కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలయ్యాయి. ‘కేజీఎఫ్ 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలు కూడా అదే బాటలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాను ఈ భాషలతో పాటు బెంగాలీలో కూడా డబ్ చేశారు. ‘పుష్ప 2’ చిత్రం బెంగాలీ భాషలోకూడా విడుదలవుతుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ‘పుష్ప 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇక ఇప్పుడు బెంగాలీ భాషా ప్రేక్షకులను కూడా ఆకర్షించేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రచారం చేయనున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ తదితరులు పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను మే 1న విడుదల చేయనున్నారు. ఆ పాట విడుదలయ్యాక హైప్ రెట్టింపు అవుతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల‌కానుంది.  ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles