iBomma Ravi Case: బెయిల్ కోసం ఎదురుచూస్తోన్న ఐ బొమ్మ రవికి బిగ్ షాక్.. తండ్రి సంచలన నిర్ణయం
ఐ బొమ్మ రవిని కాపాడేందుకు సలీం అనే ఫేమస్ లాయర్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇది చాలా సింపుల్ కేస్ అని, రవికి ఈజీగా బెయిల్ వస్తుందని సలీం మీడియాతో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ఇమ్మడి రవి తండ్రి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి కోట్లాది రూపాలయ నష్టం కలిగించిన అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నాంపల్లి కోర్టు రవికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అదే సమయంలో విచారణ నిమిత్తం పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే రవిని బయటకు తీసుకొచ్చేందుకు సలీం అనే ఫేమస్ లాయర్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. గతంలో ఏపీ రాజకయాల్లో పలు సంచలన కేసులు వాదించిన ఆయన ఇప్పుడు ఇమ్మడి రవి తరఫున వాదించేందుకు రెడీ అయ్యాడు. గురువారం (నవంబర్ 20) మీడియాతో మాట్లాడిన సలీం రవికి తప్పుకుండా బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా రవిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా లాయర్ సలీం రవి తండ్రి అప్పారావు కలిశారు. రవి తండ్రి ప్రస్తుతం విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో లాయర్ సలీం స్వయంగా వెళ్లి రవి తండ్రి అప్పారావును కలిశారు. రవి తరపున తాను వాదించి తనని బయటకు తీసుకు వస్తానని అందుకు కావలసిన కొన్ని పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని సలీం అప్పారావుతో చెప్పారు. అయితే రవి తండ్రి అందుకు పూర్తిగా నిరాకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితులు ఏమాత్రం బాలేవని ఆరోగ్యం సహకరించని నేపథ్యంలో తాను ఈ కేసు విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేనంటూ అప్పారావు చెప్పినట్లు సమాచారం.
కాగా ఐబొమ్మ రవి ఇలా జైలు పాలవ్వడంతో అతని తండ్రి అప్పారావు మానసికంగా కుంగిపోయారు. తన కొడుకు హైదరాబాదులో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారని మాత్రమే తెలుసు కానీ ఇలాంటి పాడిపని చేస్తున్నాడని తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారాయన. అలాగే సినిమాల విషయంలో తన కొడుకు రవి చేస్తుంది పూర్తిగా తప్పని తన కొడుకు వ్యతిరేకంగా అప్పారావు మాట్లాడుతూనే ఉన్నారు.ఇప్పుడు కూడా తనకు బెయిల్ తెప్పించడం కోసం అవసరమైన పేపర్ల పై సంతకాలు చేయడానికి కూడా అప్పారావు నిరాకరించడం సంచలనంగా మారింది. కొడుకు పట్ల అప్పారావు కఠిన వైఖరిని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




