AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇదే ఫైనల్ వార్నింగ్.! ఆ హీరోతో డేటింగ్‌లో లేను.. తెగేసి చెప్పిన క్రేజీ హీరోయిన్

తమిళ నటి దివ్యభారతి తనపై వస్తున్నా విమర్శలను తిప్పికొట్టింది. నటుడు జీవి ప్రకాశ్ దంపతుల విడాకుల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా తన పేరు లాగుతున్నారు. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

Tollywood: ఇదే ఫైనల్ వార్నింగ్.! ఆ హీరోతో డేటింగ్‌లో లేను.. తెగేసి చెప్పిన క్రేజీ హీరోయిన్
Tollywood
Ravi Kiran
|

Updated on: Apr 02, 2025 | 1:38 PM

Share

తమిళ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకులకు కారణం హీరోయిన్ దివ్యభారతి అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అలాగే కొందరు విమర్శలు కూడా గుప్పించారు. వీటిని ఆమె ఖండించింది కూడా.. అయితే తాజాగా మరోసారి ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

‘నాకు సంబంధం లేని విషయాల్లోకి నా పేరు లాగుతున్నారు. జీవి ప్రకాశ్ కుటుంబ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. నేను ఏ హీరోను డేటింగ్ చేయను. ముఖ్యంగా పెళ్లి అయిన వ్యక్తీతో డేటింగ్ చేయను. సరైన ఆధారాలు లేకుండా రూమర్స్ సృష్టించకండి. ఇప్పటిదాకా ఈ విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ కొన్ని రోజులుగా ఈ రూమర్స్ హద్దులు దాటాయి. వీటి వల్ల నా పేరు డ్యామేజ్ అవుతోంది. ఈ ఫేక్ రూమర్స్ బదులు సమాజానికి అవసరమయ్యే వాటి గురించి ఆలోచించండి. నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. ఈ విషయంపై ఇదే నా మొదట.. చివరి ప్రకటన’ అని హీరోయిన్ దివ్యభారతి తెగేసి చెప్పింది.

గతంలోనూ జీవి ప్రకాశ్ దంపతుల విడాకులపై దివ్యభారతి స్పందించింది. వారి విడాకులకు తానే కారణమని ఎందరో విమర్శించారని చెప్పింది. తనను తిడుతూ మెసేజ్‌లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, జీవి ప్రకాశ్, దివ్యభారతి కలిసి ‘బ్యాచిలర్’, ‘కింగ్‌స్టన్’ లాంటి సినిమాల్లో నటించారు. ఈ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు అందుకున్నాయి.

Divya Bharathi

బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..