మహాభారతం మొత్తం తీయగలను!

‘మహాభారతం’ మొత్తం తీస్తానని దర్శక ధీరుడు రాజమౌళి పేర్కొన్నారు. ‘మహాభారతం’ రాజమౌళికి డ్రీమ్‌ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 11 సినిమాలను ఇప్పటివరకూ రాజమౌళి తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కాగా.. తాజాగా ఆయన ‘మత్తు వదలరా’ టీం జై సింహా, అగస్త్య, సత్యతో చిట్‌చాట్ చేశారు. అందులో భాగంగా రాజమౌళికి రివర్స్‌గా వారు వేసిన ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. కొత్త వాళ్లతో మీరు సినిమాలు చేస్తారా? అన్న […]

మహాభారతం మొత్తం తీయగలను!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 30, 2019 | 2:10 PM

‘మహాభారతం’ మొత్తం తీస్తానని దర్శక ధీరుడు రాజమౌళి పేర్కొన్నారు. ‘మహాభారతం’ రాజమౌళికి డ్రీమ్‌ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 11 సినిమాలను ఇప్పటివరకూ రాజమౌళి తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కాగా.. తాజాగా ఆయన ‘మత్తు వదలరా’ టీం జై సింహా, అగస్త్య, సత్యతో చిట్‌చాట్ చేశారు. అందులో భాగంగా రాజమౌళికి రివర్స్‌గా వారు వేసిన ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

కొత్త వాళ్లతో మీరు సినిమాలు చేస్తారా? అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ.. నేను సినిమాలోని పాత్రలను బట్టి యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటానన్నారు. కథ డిమాండ్ చేస్తే.. కొత్త, పాత అనే తేడాలు ఉండవని అన్నారు. అయితే.. మహాభారతంలోని ఒక్క పార్ట్ అయినా మీరు పూర్తి చేస్తారని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు.. మహాభారతం మొత్తం నేను పూర్తి చేయగలను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మహాభారతం అతి పెద్ద కథ. అయినా నేను దాన్ని నా స్టైయిల్లో మార్చుకోగలను. కథ రాసేటప్పుడు ఒత్తిడులు సహజం. వాటిని పట్టించుకోకపోతేనే ఒత్తిడి జయించగలం. నేనెప్పుడూ ఇలాగే ఆలోచిస్తానని.. అందుకే నేను టెన్షన్ ఫ్రీ ఉంటానని చెప్పుకొచ్చాడు రాజమౌళి.