AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైజాగ్‌కు టాలీవుడ్ నిగనిగలు.. జగన్ ప్లాన్ ఇదేనా.?

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీని సాగరతీరంలో నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు విశాఖలో స్టూడియోలు ఉన్న విషయం తెలిసిందే. పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా సీఎం మూడు రాజధానుల ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో సరికొత్త టాలీవుడ్ ప్రతిపాదన  కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. రీసెంట్‌గా జరిగిన విశాఖ ఉత్సవ్‌లో జగన్‌కు ప్రజలు ఆహ్వానం పలికిన తీరు చూస్తే.. […]

వైజాగ్‌కు టాలీవుడ్ నిగనిగలు.. జగన్ ప్లాన్ ఇదేనా.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 30, 2019 | 3:14 PM

Share

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీని సాగరతీరంలో నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు విశాఖలో స్టూడియోలు ఉన్న విషయం తెలిసిందే. పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా సీఎం మూడు రాజధానుల ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో సరికొత్త టాలీవుడ్ ప్రతిపాదన  కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. రీసెంట్‌గా జరిగిన విశాఖ ఉత్సవ్‌లో జగన్‌కు ప్రజలు ఆహ్వానం పలికిన తీరు చూస్తే.. చాలామంది విశాఖను పరిపాలనా రాజధానిగా ఆయన చేసిన ఆలోచనకు ఆమోదం తెలిపినట్లు అనిపిస్తోంది. ఐటీ పరిశ్రమల నుంచి ఇతరత్రా సంస్థలన్నీ కూడా ఇప్పుడు విశాఖకు తరలి రావాల్సిన ఉంది. ఇక వైజాగ్‌లో స్టార్ హోటళ్లకు కొదవ లేదు.. అంతేకాక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులో ఉంది. ఇప్పటికే టాలీవుడ్ షూటింగులన్నీ కూడా అధిక శాతం విశాఖ, అరకులో జరుగుతున్నాయి. దీని వల్ల పర్యాటకం కూడా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంది.

ఇకపోతే కొంతమంది నేతలు వైజాగ్‌లో టాలీవుడ్‌కు రూపకల్పన జరుగుతుందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా విశాఖ రాజధాని అని ప్రకటించగానే సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా సుముఖంగా ఉన్నారు. విశాఖ, అరకు ప్రదేశాల్లో హైదరాబాద్‌ను తలపించే రీతిలో కొత్త టాలీవుడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ ప్రతిపాదనగా తెలుస్తోంది. దీనికి నిదర్శనమే విశాఖ ఉత్సవంలో ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్ స్వయంగా చేసిన ప్రకటన. ఒకవేళ ఇదే నిజమైతే సినీ పరిశ్రమ పేరుతో ఎంతోమందికి ఉపాధి లభించనుంది. అంతేకాక పన్నుల రూపాన ప్రభుత్వానికి దాదాపు 3000 కోట్లు ఆదాయం పెరుగుందని కూడా సమాచారం. మరి దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.