ఇది తొలి ప్రయత్నం.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్

తెలుగు న్యూస్ ఛానెల్ చరిత్రలో టీవీ9.. నవ నక్షత్ర సన్మానం కార్యక్రమంలో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. టీవీ9 పదిహేను సంవత్సరాల కాలంలో తొలిసారిగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రయత్నించి సక్సెస్ అయ్యామన్నారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. దీనిని ఇక నుంచి ప్రతి ఏటా కొనసాగించాలన్న లక్ష్యంతో ముందుకు కొనసాగుతామన్నారు. సమాజంలో ఏదైతే మరుగున పడిపోయిన ప్రతిభ ఉందో.. ఆ ప్రతిభను వెలికితీసి.. సమాజం దృష్టికి తీసుకొచ్చి.. మెరుగైన సమాజంలో వారిని పరిచయం చేయడం కోసమే […]

ఇది తొలి ప్రయత్నం.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 30, 2019 | 1:31 AM

తెలుగు న్యూస్ ఛానెల్ చరిత్రలో టీవీ9.. నవ నక్షత్ర సన్మానం కార్యక్రమంలో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. టీవీ9 పదిహేను సంవత్సరాల కాలంలో తొలిసారిగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రయత్నించి సక్సెస్ అయ్యామన్నారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. దీనిని ఇక నుంచి ప్రతి ఏటా కొనసాగించాలన్న లక్ష్యంతో ముందుకు కొనసాగుతామన్నారు. సమాజంలో ఏదైతే మరుగున పడిపోయిన ప్రతిభ ఉందో.. ఆ ప్రతిభను వెలికితీసి.. సమాజం దృష్టికి తీసుకొచ్చి.. మెరుగైన సమాజంలో వారిని పరిచయం చేయడం కోసమే ఈ నవ నక్షత్ర అవార్డుల లక్ష్యమన్నారు. ఒక మీడియా సంస్థగా..బాధ్యతలో భాగంగా మొదటి సారి ఈ ప్రయత్నం చేశామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి.. సినీ ప్రముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జున, దర్శకుడు కె. విశ్వనాథ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌ రావు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ పీవీ వెంకట కృష్ణారెడ్డి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రతిభావంతులను గుర్తించేందుకు సహకరించిన జ్యూరీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.