ఫిల్మ్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్.. సీఎం కేసీఆర్
తెలుగు న్యూస్ ఛానెల్ చరిత్రలో టీవీ9.. అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చి.. సమాజ ప్రగతికి దోహదపడిన పలువురికి టీవీ9 నవ నక్షత్ర సన్మాన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్.. టీవీ9 చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా.. మాట్లాడిన సీఎం కేసీఆర్.. సమావేశం అంటే.. రెగ్యూలర్ మీటింగ్‌లా ఉంటుందనుకున్నానని.. కానీ టీవీ9 మమ్మల్ని భిన్నమైన ప్రపంచానికి తీసుకెళ్లిందని.. అందుకు […]
తెలుగు న్యూస్ ఛానెల్ చరిత్రలో టీవీ9.. అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చి.. సమాజ ప్రగతికి దోహదపడిన పలువురికి టీవీ9 నవ నక్షత్ర సన్మాన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్.. టీవీ9 చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా.. మాట్లాడిన సీఎం కేసీఆర్.. సమావేశం అంటే.. రెగ్యూలర్ మీటింగ్‌లా ఉంటుందనుకున్నానని.. కానీ టీవీ9 మమ్మల్ని భిన్నమైన ప్రపంచానికి తీసుకెళ్లిందని.. అందుకు టీవీ9 ఛానెల్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కె. విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంగా వందల కోట్ల రూపాయల్ని సంపాదించే సినిమాలు వస్తున్నాయని.. కానీ దర్శకుడు కె. విశ్వనాథ్ డబ్బుల కోసం తీసేవి కాదని.. ఆయన తీసిన చిత్రాలన్నీ అందరికీ భిన్నమైన రీతిలో ఉండే శైలిలో ఉండేదన్నారు.
అందరికీ ఆదర్శంగా టీవీ9 అడుగులు
ఇక తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీవీ9 న్యూస్ ఛానెల్.. మీ సామాజిక బాధ్యతను గుర్తెరిగి.. సెలబ్రిటీలనే కాకుండా.. అన్ సన్గ్ హీరోస్‌కు కూడా సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమానికి విశేష మైన సమాజసేవ చేస్తున్న మేధావులను జ్యూరీలో పెట్టి.. నవ నక్షత్ర సన్మాన అవార్డులకు సెలక్ట్ చేయడం.. వారందరికీ సన్మానం చేయడం.. ఆదర్శప్రాయంగా ఉందన్నారు.
ఫిల్మ్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్
టీవీ9 నవ నక్షత్ర సన్మాన కార్యక్రమం వేదికగా.. హైదరాబాద్‌ను ఫిల్మ హబ్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతాన్నారు సీఎం కేసీఆర్. గతంలో ఓ సందర్భంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున తనతో కలిశారని.. ఆ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తనతో హైదరాబాద్ సినీ పరిశ్రమ గురించి చర్చించారన్నారు. ప్రస్తుతం మినీ స్క్రీన్ వచ్చినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారని.. హైదరాబాద్ కూడా ముంబైకి ధీటుగా ఎదిగిందన్న విషయాన్ని తెలిపారన్నారు. బిగ్ బీ ఇచ్చిన సలహాతో.. ఫిల్మ్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్‌ను తీర్చేందుకు కృషి చేస్తానని.. త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సమస్యల్ని పరిష్కరించి.. ముందుకు వెళ్తామన్నారు కేసీఆర్.