AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immadi Ravi Father : సజ్జనార్ గారూ.. మా బాధ చూసి ఈ ఒక్క పని చేయండి చాలు.. ఇమ్మడి రవి తండ్రి కన్నీళ్లు..

ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు ఇమ్మడి రవి. మొన్నటి వరకు అసలు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు అతడే అని తెలియడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Immadi Ravi Father : సజ్జనార్ గారూ.. మా బాధ చూసి ఈ ఒక్క పని చేయండి చాలు.. ఇమ్మడి రవి తండ్రి కన్నీళ్లు..
Immadi Ravi Father
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2025 | 1:19 PM

Share

ఇమ్మడి రవి.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. సినిమాలు పైరసీ చేసి లీక్ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు. ఇటీవలే అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా పైరసీ చేస్తూ చిత్రనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న ఇమ్మడి రవిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఆనందం వ్యక్తం చేసింది. అటు సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇమ్మడి రవి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతడు కేవలం సినిమాలు పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా చేశాడని తెలిపారు. దీంతో అతడికి శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది.

ఇదెలా ఉంటే.. ఇమ్మడి రవి అరెస్ట్, కేసులపై అతడి తండ్రి అప్పారావు స్పందించారు. తన కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని అనుకున్నామని.. ఇలాంటి పని చేస్తున్నాడని తనకు తెలియదని అన్నాడు. తప్పు ఎవరు చేసిన తప్పే కాబట్టి శిక్ష వేయడం సరైనదే అన్నారు. తాజాగా మరో వీడియో రిలీజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకును స్టేషన్ లో ఇబ్బంది పెట్టొద్దని.. అతడికి ఒక కూతురు ఉందంటూ ఎమోషనల్ అయ్యారు.

ఆ వీడియోలో అప్పారావు మాట్లాడుతూ.. సజ్జనార్ గారు.. దయచేసి స్టేషన్ లో మా వాడిని ఇబ్బంది పెట్టకండి. మీ బాధ్యతలను కాదని వాడిని విడిచిపెట్టమని నేను అడగడం లేదు. కానీ అతడికి ఒక కూతురు ఉంది. తన గురించి తలుచుకుంటే ఏడుపోస్తుంది. కనీసం ఆ బిడ్డ గురించి ఆలోచించి తనకు తక్కువ శిక్ష పడేలా చేయండి. నా కోడలు నాతో మాట్లాడదు. మా కన్నీళ్లు చూసి సజ్జనార్ సార్ కు జాలీ కలగొచ్చు. కానీ ఆయనది కూడా నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. మా బాధను చూసి కనీసం కొంచెం తక్కువ శిక్ష పడేలా చూస్తే చాలు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

Follow Us