Sita Ramam Teaser Talk: అందమైన ప్రేమకథగా ‘సీతా రామం’.. ఆకట్టుకుంటున్న టీజర్..

'సీతా రామం' టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది. '

Sita Ramam Teaser Talk: అందమైన ప్రేమకథగా 'సీతా రామం'.. ఆకట్టుకుంటున్న టీజర్..
Sita Ramam
Rajitha Chanti

|

Jun 26, 2022 | 9:42 AM

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‏కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది.. మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రలో ఒదిగిపోయి.. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ఈ స్టార్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సీతా రామం. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇక తాజాగా విడుదలైన సీతా రామం టీజర్‏కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది. ”లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ ఈ వాయిస్ ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా ఉన్నాయి. లెఫ్టినెంట్‌ రామ్‌ గా దుల్కర్ సల్మాన్ మెస్మరైజ్ చేశారు. తన గత సినిమాల కంటే ఇందులో మరింత హ్యాండసమ్ గా కనిపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అని దుల్కర్ అన్నవెంటనే నిండు సంప్రాదాయంగా సీత పాత్ర రివిల్ కావడం హను రాఘవపూడి లవ్లీ మార్క్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ ల కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లావిష్ గా ఉంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం హార్ట్ టచింగ్ గా వుంది. ప్రొడక్షన్ విలువలు అత్యున్నతంగా వున్నాయి. వండర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కథనం, అందమైన విజువల్స్, మ్యాజికల్ మ్యూజిక్ తో’ సీతా రామం’ ఒక ఎపిక్ లవ్ స్టోరీగా ఉండబోతోందని టీజర్ భరోసా ఇస్తుంది. ”సీతా రామం” తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుంది. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu