భారీ కటౌట్లు..అంగరంగవైభవంగా ఏర్పాట్లు..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ ఈవెంట్‌కు రంగం సిద్దమైంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం అంగరంగవైభవంగా ముస్తాబైంది. మహేశ్‌బాబుతో మెగాస్టార్ అభిమానులు తరలిరానున్న ఈ ఈవెంట్ కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే స్టేడియంలో పెట్టిన మహేశ్, చిరు భారీ కటౌట్లు మూవీ లవర్స్‌ను స్పెషల్‌గా ఆకర్షిస్తున్నాయి. కాగా ఈరోజు జరగనున్న ఈవెంట్‌లో మహేశ్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:18 pm, Sun, 5 January 20
భారీ కటౌట్లు..అంగరంగవైభవంగా ఏర్పాట్లు..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ ఈవెంట్‌కు రంగం సిద్దమైంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం అంగరంగవైభవంగా ముస్తాబైంది. మహేశ్‌బాబుతో మెగాస్టార్ అభిమానులు తరలిరానున్న ఈ ఈవెంట్ కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే స్టేడియంలో పెట్టిన మహేశ్, చిరు భారీ కటౌట్లు మూవీ లవర్స్‌ను స్పెషల్‌గా ఆకర్షిస్తున్నాయి. కాగా ఈరోజు జరగనున్న ఈవెంట్‌లో మహేశ్ గురించి చిరు ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌లో ప్లాప్ అంటూ ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ను తెరకెక్కించారు. లేడీ అమితాబ్ విజయశాంతి, హీరోయిన్ సంగీత, కమెడియన్ బండ్ల గణేశ్ ఈ మూవీతో తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా బండ్ల గణేశ్ సెంట్రిగ్గా తెరకెక్కించిన ట్రైన్ ఎపిసోడ్ ఆడియెన్స్ విపరీతంగా అలరించనుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, తమన్నా ఓ ప్రత్యేక  గీతంలో ఆడిపాడింది.  పొంగల్  కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘సరిలేరు నీకెవ్వరు’.

‘మెగాసూపర్’ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ దిగువన చూడండి :