AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Love: ఫ్రాన్స్ కంటే భారత్ గొప్పదా? ఫ్రెంచ్ మహిళ చెప్పిన ఆ 5 కారణాలు వింటే గర్వంతో పొంగిపోతారు!

మనం ఎప్పుడూ విదేశీయుల జీవనశైలిని చూసి మురిసిపోతుంటాం. కానీ ఒక ఫ్రెంచ్ మహిళ మాత్రం, తన దేశం ఫ్రాన్స్ కంటే భారతదేశమే చాలా విషయాల్లో మిన్న అని చెబుతోంది. "ఫ్రెల్డవే" (Freldaway) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, ఇండియాలో తనకున్న అనుభవాలను పంచుకుంటూ.. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ నుండి ఆత్మీయత వరకు ఐదు అంశాలను ప్రత్యేకంగా ప్రశంసించింది. భారతీయుల మనసు గెలుచుకుంటున్న ఆ వైరల్ వీడియో విశేషాలు మీకోసం.

India Love: ఫ్రాన్స్ కంటే భారత్ గొప్పదా? ఫ్రెంచ్ మహిళ చెప్పిన ఆ 5 కారణాలు వింటే గర్వంతో పొంగిపోతారు!
India Vs France
Bhavani
|

Updated on: Jan 14, 2026 | 7:49 PM

Share

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు విదేశీయులు ఫిదా అవుతున్నారు. పని నిమిత్తం ఇండియాకు వచ్చిన ఒక ఫ్రెంచ్ మహిళ, ఇక్కడి జీవనశైలికి ఫిదా అయిపోయి.. “ఫ్రాన్స్ కంటే ఇండియా మెరుగ్గా చేసే పనులు” అంటూ ఒక లిస్ట్ తయారు చేసింది. ఇందులో ఆమె పేర్కొన్న అంశాలు మన దేశ గొప్పతనాన్ని మరోసారి చాటిచెబుతున్నాయి. ఆ ఐదు విశేషాలు ఏంటో చదవండి.

భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ యువతి, తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భారతదేశం ఫ్రాన్స్ కంటే మెరుగ్గా ఉన్న 5 ముఖ్యమైన అంశాలను వివరించింది:

స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి: ఎక్కడ చూసినా అతి తక్కువ ధరకే లభించే రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు ఆమెను ఆకట్టుకున్నాయి. కేవలం రుచి మాత్రమే కాదు, వ్యాపారులతో చేసే సరదా సంభాషణలు ఆత్మీయతను పంచుతాయని ఆమె పేర్కొంది.

భారతీయ ఆభరణాలు : భారతీయ మహిళలు ధరించే జుంకాలు, గాజులు, నెక్లెస్‌ల డిజైన్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని ఆమె ప్రశంసించింది. ఇక్కడికి వచ్చాక తాను కూడా ఆ స్టైల్‌ను ఫాలో అవుతున్నానని చెప్పింది.

View this post on Instagram

A post shared by Freldaway (@freldaway)

రాత్రి ప్రయాణాలు : ఇండియాలోని స్లీపర్ ఏసీ బస్సులు, రైళ్లలో రాత్రిపూట ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. విమానాల కంటే రైలు ప్రయాణాలే అందమైన ప్రకృతి దృశ్యాలను చూసేందుకు బాగుంటాయని సూచించింది.

కేశ సంరక్షణ : భారతీయులకు జుట్టు చాలా ఒత్తుగా, బలంగా ఉంటుందని.. ఇక్కడి ప్రజలు పాటించే నూనె రాసే పద్ధతులు, సంప్రదాయ హెయిర్ కేర్ అద్భుతమని కొనియాడింది. భారతీయులు సులభంగా షాంపూ యాడ్స్ లో నటించవచ్చని సరదాగా వ్యాఖ్యానించింది.

అతిథి మర్యాదలు : భారతీయుల ఆత్మీయతకు ఆమె ఫిదా అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఇంట్లో మనిషిలా ఆహ్వానించడం, ప్రేమగా భోజనం పెట్టడం వంటివి ఇండియాలో మాత్రమే సాధ్యమని, ఫ్రాన్స్‌లో కూడా ఇలాంటి ఆత్మీయత ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమోషనల్ గా చెప్పింది.