AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 కోసం హాలీవుడ్ బ్యాచ్‌ను దింపుతున్న రిషబ్ శెట్టి..

ఇంతకుముందు కథ, ఫైటింగ్, పాటలపై ఎక్కువ శ్రద్ధ పెట్టగా, ఇప్పుడు మేకింగ్‌కి కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తూ సినిమాను నిర్మిస్తున్నారు మేకర్స్. ఇందుకోసం హాలీవుడ్‌లోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారు. లేదా హాలీవుడ్ సంస్థలతో కలిసి పనిచేయడంలాంటి చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా 'కాంతార చాప్టర్ 1' కోసం హాలీవుడ్ సంస్థ చేయి కలుపుతున్నాడని తెలుస్తోంది. 

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 కోసం హాలీవుడ్ బ్యాచ్‌ను దింపుతున్న రిషబ్ శెట్టి..
Rishab Shetty
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2024 | 8:08 AM

Share

సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ, సౌండ్ డిజైన్, కెమెరా పనితనం బాగుంటే ఆ సినిమా విజువల్ వండర్ అవ్వడం ఖాయం. ఇలాంటి వాటితో పాటు కంటెంట్‌కు ప్రాధాన్యత ఉంటే ఆ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇంతకుముందు కథ, ఫైటింగ్, పాటలపై ఎక్కువ శ్రద్ధ పెట్టిన మేకర్స్.. ఇప్పుడు మేకింగ్‌కి కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తూ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే హాలీవుడ్‌లోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారు. లేదా హాలీవుడ్ సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా ‘కాంతార చాప్టర్ 1’ కోసం హాలీవుడ్ సంస్థ చేయి కలుపుతున్నాడని తెలుస్తోంది.

‘కాంతార’ సినిమాలో సెట్, మేకప్, కలర్ గ్రేడింగ్ తదితర విషయాల్లో చాలా కేర్ తీసుకున్న రిషబ్ శెట్టి.. ‘కాంతార చాప్టర్ 1’ సినిమాను టెక్నికల్ గా గ్రాండ్ గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు రిషబ్. ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ వినియోగం ఎక్కువగా ఉంటుందని, అందుకే హాలీవుడ్‌కు చెందిన ఎక్స్‌పర్ట్స్ , అలాగే ఏజెన్సీతో అగ్రిమెంట్‌ చేసుకున్నారని తెలుస్తోంది. ‘క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ఆస్కార్ విజేత ‘ది లయన్ కింగ్’ వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ చేసిన మూవింగ్ పిక్చర్స్ సంస్థ ‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ చేయనుంది.

ఈ సంస్థ చాలా అత్యుత్తమ హాలీవుడ్ సినిమాలకు వీఎఫ్‌ఎక్స్ చేసింది. ఈ సంస్థ ‘హ్యారీ పోటర్’, ‘బ్యాట్‌మాన్’, ‘షెర్లాక్ హోమ్స్’ వంటి పలు చిత్రాలకు పనిచేసింది. ఇప్పటికే రిలీజైన ‘కాంతార’ సినిమా కంటే వందేళ్ల క్రితం నాటి కథాంశంతో పౌరాణిక కథతో ‘కాంతార చాప్టర్ 1’ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వాడకం ఎక్కువగా ఉండడంతో పాటు వీఎఫ్‌ఎక్స్ సీన్స్ బెస్ట్ క్వాలిటీగా ఉండాలి కాబట్టి హాలీవుడ్ ఆర్గనైజేషన్ సహాయం తీసుకుంటున్నారు. ‘కాంతార’ సినిమాకు పెట్టుబడి పెట్టిన హోంబాలే.. ‘కాంతారావు చాప్టర్ 1’కి కూడా పెట్టుబడి పెట్టి ఈ సినిమాకి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు.

రిషబ్ శెట్టి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.