హిందూ సంఘాల వార్నింగ్.. ఇంకోసారి ఇలా చేయమంటూ క్లారిటీ ఇచ్చిన యాంకర్ రవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తూ ఉంటే రంభ కనిపిస్తుంది. అయితే అదే సీన్ ను రీసెంట్ గా ఓ టీవీ షోలో యాంకర్ రవి, సుడిగాలి సుదీర్ రీక్రియెట్ చేశారు. ఈ టీవీ షోలో సుధీర్ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తూ ఉన్న సమయంలో రంభ కనిపిస్తుంది.

యాంకర్ రవిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల సుడిగాలి సుధీర్‌తో కలిసి రవి చేసిన ఒక స్కిట్‌తో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణ ఉంది. ఈ స్కిట్‌లో “బావగారు బాగున్నారా” సినిమా సీన్‌ను రీక్రియేట్ చేశారు. సినిమాలో చిరంజీవి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తూ ఉంటే రంభ కనిపిస్తుంది. అయితే అదే సీన్ ను రీసెంట్ గా ఓ టీవీ షోలో యాంకర్ రవి, సుడిగాలి సుదీర్ రీక్రియెట్ చేశారు. ఇది కొందరు హిందూ సంఘాలు అభ్యంతరకరంగా భావించాయి. రాష్ట్రీయ వానర సేన వంటి సంస్థలు రవి హిందూ సమాజాన్ని కించపరిచేలా పరాచకాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనకు వార్నింగ్‌లు ఇచ్చాయి. కామెడీ కోసం ఇలా చేయడం అనేది కచ్చితంగా కరెక్ట్ కాదు. రవితో పాటు షో నిర్వాహకులు కూడా వెంటనే క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో దీని పై యాంకర్ రవి ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తపడతాం అని రవి ఆ వీడియోలో తెలిపాడు.




