Sri Divya: పెళ్ళికి సిద్దమైన తెలుగు హీరోయిన్ శ్రీ దివ్య.. వరుడు ఎవరో తెలుసా..
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య పెళ్లి రేపు (నవంబర్ 1)న ఇటలీలో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు క్రేజీ హీరోయిన్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. అదికూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని తెలిపింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీ దివ్య. ఈ తెలుగమ్మాయి మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్టాప్ అనే సినిమాతో హీరోయిన్ గా మరిచయం అయ్యింది.
సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రేమలు పెళ్లిళ్ల సందడి నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, హీరోలు పెళ్లి పీటలెక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య పెళ్లి రేపు (నవంబర్ 1)న ఇటలీలో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు క్రేజీ హీరోయిన్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. అదికూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని తెలిపింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీ దివ్య. ఈ తెలుగమ్మాయి మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్టాప్ అనే సినిమాతో హీరోయిన్ గా మరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత సినిమాలో నటించింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది శ్రీదివ్య.
అక్కడ వరుస సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. శివకార్తికేయన్ సరసన హీరోయిన్ గా ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో అక్కడే సినిమాలు చేసింది శ్రీ దివ్య.
అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోన్న శ్రీ దివ్య.. ‘కాక్కీ సట్టై’, ‘జీవా’, ‘ఈటీ’, ‘మరుదు’, ‘బెంగుళూర్ నాట్కల్’, ‘పెన్సిల్’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది తన ప్రేమ వ్యవహారం గురించి బయట పెట్టింది. తాజాగా శ్రీదివ్య ‘రైడ్’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదివ్యకు పెళ్లి పై ప్రశ్న ఎదురైంది. దీని పై స్పందిస్తూ.. నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. అదికూడా ప్రేమ పెళ్లి. నేను ప్రేమించిన వ్యక్తితోనే త్వరలో నా పెళ్లి జరగబోతుంది అని తెలిపింది. దాంతో శ్రీ దివ్య లవర్ ఎవరు అని శ్రీదివ్య అభిమానులు వెతికేస్తున్నారు.మరి ఈ అమ్మడు తాను ప్రేమించిన వ్యక్తి గురించి తెలుపుతుందేమో చూడాలి.
View this post on Instagram
శ్రీదివ్య ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..