Janhvi Kapoor: ‘దేవర’లో జాన్వీ పాత్రపై లేటెస్ట్‌ బజ్‌.. సెకండాఫ్‌లో…

2018లో వచ్చిన ధడక్‌ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన అందాల తార జాన్వీ కపూర్ ఇప్పటి వరకు నార్త్‌లోనే సినిమాలు చేస్తూ వస్తోంది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులకు అలరించిన ఈ చిన్నది ఇప్పటి వరకు కమర్షియల్‌గా పెద్ద విషయాన్ని మాత్రం అందుకోలేదనే చెప్పాలి. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుందీ చిన్నది. జాన్వీకి ఇన్‌స్టాలో ఏకంగా...

Janhvi Kapoor: 'దేవర'లో జాన్వీ పాత్రపై లేటెస్ట్‌ బజ్‌.. సెకండాఫ్‌లో...
Janhvi Kapoor
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 31, 2023 | 8:02 AM

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవీ నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార జాన్వీ కపూర్. సినిమా నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనం అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ.

2018లో వచ్చిన ధడక్‌ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన అందాల తార జాన్వీ కపూర్ ఇప్పటి వరకు నార్త్‌లోనే సినిమాలు చేస్తూ వస్తోంది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులకు అలరించిన ఈ చిన్నది ఇప్పటి వరకు కమర్షియల్‌గా పెద్ద విషయాన్ని మాత్రం అందుకోలేదనే చెప్పాలి. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుందీ చిన్నది. జాన్వీకి ఇన్‌స్టాలో ఏకంగా 22.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సినిమాలతో సమానంగా సోషల్‌ మీడియా ద్వారా సంపాదిస్తోంది జాన్వీ.

విజయాలతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోందీ బ్యూటీ. కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో చిత్రాల్లో నటిస్తూ వస్తున్న జాన్వీ.. ‘దేవర’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జాన్వీ ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంది. చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన జాన్వీ ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంది.

జాన్వీకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో జాన్వీ పాత్రకు సంబంధించిన ఓ విషయం ఆసక్తిని పెంచుతోంది. జాన్వీ కపూర్ పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దేవర సినిమాలో జాన్వీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుందని తెలుస్తోంది. సినిమా సెకండాఫ్‌లో జాన్వీకపూర్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ హీరోయిన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌కు ఎందుకు మారాల్సి వచ్చిందనేది కథలో కీలక అంశమని చెబుతున్నారు.

ఈ నెగిటివ్‌ షేడ్‌లోని ఎలిమెంట్స్ నచ్చడం వల్లే జాన్వీ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసిందని సమాచారం. మరి సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ దేవరతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే గోవాలో కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా, త్వరలోనే కర్నాకటలో కొత్త షెడ్యూల్‌ మొదలు పెట్టనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!