Actress Poorna: పూర్ణ పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

ఇటీవల కాలంలో సినిమా తారల పెళ్లిళ్లు పెటాకులవడం మనం చూస్తూనే ఉన్నాం .. ఇప్పటికే చాలా మంది తారలు తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పేసి గాప్చుప్ గా సినిమాలు చేసుకుంటున్నారు.

Actress Poorna: పూర్ణ పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Poorna
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 10, 2022 | 10:37 AM

ఇటీవల కాలంలో సినిమా తారల పెళ్లిళ్లు పెటాకులవడం మనం చూస్తూనే ఉన్నాం .. ఇప్పటికే చాలా మంది తారలు తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పేసి గాప్చుప్ గా సినిమాలు చేసుకుంటున్నారు. మరి కొందరైతే ఎంగేజ్ మెంట్ చేసుకున్న  తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. రష్మిక, మెహరీన్ ఇలా కొంతమంది పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ అమ్మడు వచ్చి చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. రఘుబాబు తెరకెక్కించిన అవును సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూర్ణ(Actress Poorna). ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన్తప్పటికీ ఆశించినస్థాయిలో క్లిక్ అవ్వలేక పోయింది. చాలా రోజుల తర్వాత రీసెంట్ గా బాలయ్య బాబు నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

అలాగే పలు టీవీషోలో జడ్జ్ గాను వ్యవహరిస్తోంది పూర్ణ. ఇక ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్ళడబోతోంది. గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా కేరళలో వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగిందని టాక్. అయితే వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని చాలా రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది పూర్ణ.. తన ప్రియుడితో కలిసున్నా ఫోటోని షేర్ చేసింది. ఒక్క ఫొటోతో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని వస్తోన్న రూమర్స్ కు చెక్ పెట్టిసింది పూర్ణ. త్వరలోనే వీరి పెళ్ళికి సంబంధించిన వివరాలు అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి