Kajol: షారుఖ్ ఖాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కాజోల్.. అంతమాట అనేసిందేంటి !
బాలీవుడ్ నటి కాజోల్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్2 ఇటీవల విడుదలైంది. ఆ జోష్‌లో ఉండగానే కోర్టు రూమ్ డ్రామా ది ట్రయల్ జనాల ముందుకు వచ్చింది.

పెదవి దాటితే పృథ్వి దాటుతుందనే మాటను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు సీనియర్ యాక్ట్రెస్ కాజోల్. ఈ మధ్య తన ప్రాజెక్టుల రిలీజ్‌లు ఉండటంతో మీడియా ముందుకు వస్తున్నారు కాజోల్. అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె అన్న కొన్నిమాటలు కాంట్రవర్శీలకు దారితీశాయి. లేటెస్ట్ వివాదంలో ఆమె ఫ్రెండ్ షారుఖ్ కూడా ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటారా? మీరూ చూసేయండి. బాలీవుడ్ నటి కాజోల్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఇటీవల విడుదలైంది. ఆ జోష్‌లో ఉండగానే కోర్టు రూమ్ డ్రామా ది ట్రయల్ జనాల ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు కాజోల్ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్శీకి దారితీశాయి.
ది ట్రయల్ ప్రమోషన్లలో భాగంగా పలు విషయాల గురించి మాట్లాడారు కాజోల్. ఆమె దగ్గర షారుఖ్ గురించి కూడా ప్రస్తావించారు క్రిటిక్స్. అందుకు స్పందిస్తూ, షారుఖ్ తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు కాజోల్. షారుఖ్‌తో రొమాంటిక్ సాంగ్ చేయాలని ఉందని మనసులోని మాటను చెప్పుకొచ్చారు.
షారుఖ్ ఇప్పుడు ఎదురైతే ఏం అడుగుతారనే ప్రశ్న ఎదురైంది కాజోల్‌కి. పఠాన్‌కి వచ్చిన నిజమైన కలెక్షన్లను చెప్పమంటాను అని అన్నారు కాజోల్. బాలీవుడ్ సూపర్‌డూపర్ మూవీ, వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిన పఠాన్ విషయంలో కాజోల్ ఇలా ఎందుకు మాట్లాడారో అర్థం కావట్లేదంటున్నారు షారుఖ్ ఫ్యాన్స్. ఆల్రెడీ ప్రకటించిన పఠాన్ కలెక్షన్లు నిజమైనవి కాదా అనే అనుమానాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. చదువుపై కనీస అవగాహన లేని నాయకులు మనల్ని పరిపాలిస్తున్నారంటూ ఆ మధ్య కాంట్రవర్శీలో చిక్కుకున్నారు కాజోల్. అయితే తాను అలా అనలేదని సంజాయిషి చెప్పుకున్నారు ఈ లేడీ. ఇప్పుడు పఠాన్ విషయంలో జరుగుతున్న రచ్చ మీద ఎలా స్పందిస్తారో చూడాలి
