Surya: ఆసక్తికరంగా సూర్య న్యూమూవీ పోస్టర్.. ఈ సారి జై భీమ్ అంటున్న వెర్సటైల్ హీరో

తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన

Surya: ఆసక్తికరంగా సూర్య న్యూమూవీ పోస్టర్.. ఈ సారి జై భీమ్ అంటున్న వెర్సటైల్ హీరో
Suriya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 23, 2021 | 6:24 PM

Surya: తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు సూర్య. ఈ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. వరుసగా చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అయినప్పటికీ సూర్య క్రేజ్ మాత్రం కొంత కూడా తగ్గలేదు. ఇటీవల సుధ కొంగరు దర్శకత్వంలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకాలేకపోయింది. ప్రముఖ ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధం అవుతునాడు ఈ వెర్సటైల్ యాక్టర్. నేడు సూర్య పుట్టిన రోజు కానుకగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

టీ జే జ్ఞాన్వెల్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో జై భీమ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుగా తీసుకురానున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకొంటోంది. ఈ పోస్టర్ ను బట్టి చూస్తుంటే ఈ మూవీలో సూర్య లాయర్ గా నటించనున్నాడని తెలుస్తోంది. అలాగే పోస్టర్ లో ఆదివాసులు ఆశగా చూస్తున్నట్టు డిజన్ చేశారు. దీన్నిబట్టి ఈ సినిమా ఆదివాసుల కోసం పోరాడే లాయర్ కథ అని అర్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్,మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. జై భీమ్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. మరి ఈ సినిమా ఏస్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: మెగాఫ్యాన్స్‌‌‌కు గుడ్ న్యూస్.. చిరు153వ సినిమా పనులు ప్రారంభం అయ్యాయి..

Babu Gogineni: కత్తి మహేష్‌‌‌‌లానే బాబు గోగినేని కూడా…. అంటూ ప్రచారం.. ఆయన ఎలా స్పందించారంటే

Nitin Check Movie: వెండి తెరపై నితిన్ ప్లాప్ సినిమాకు బుల్లి తెరపై షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!