Megastar Chiranjeevi: మెగాఫ్యాన్స్‌‌‌కు గుడ్ న్యూస్.. చిరు153వ సినిమా పనులు ప్రారంభం అయ్యాయి..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌‌‌ను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ..

Megastar Chiranjeevi: మెగాఫ్యాన్స్‌‌‌కు గుడ్ న్యూస్.. చిరు153వ సినిమా పనులు ప్రారంభం అయ్యాయి..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 23, 2021 | 5:52 PM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కితోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌‌‌చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఒక సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చిరు- చరణ్ ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ సినిమా తోపాటు మెగాస్టార్ మరో మూడు సినిమాలను లైన్‌‌‌లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ ఒకటి. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఎంటర్ అవ్వకుండా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యేది. తాజాగా ఈ సినిమా పనులను ప్రారంభించారు.

ఆచార్య సినిమా కోసం అద్భుతమైన టెంపుల్ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ .. లూసిఫర్ రీమేక్ కోసం కూడా మాసివ్ సెట్స్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ సెల్వరాజన్  సోషల్‌‌‌‌‌మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. చిరంజీవి 153 వ సినిమా పనులు ప్రారంభమయ్యాయని.. అదిరిపోయే సెట్ వేయనున్నాం అని తెలిపారు. కొత్తది ఏదైనా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త రోజు కొత్త ప్రారంభం. నా కొత్త చిత్రం కోసం సెట్ వర్క్ ప్రారంభిస్తున్నాను. అంటూ రాసుకొచ్చారు. అలాగే సెట్ లో తీసిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Babu Gogineni: కత్తి మహేష్‌‌‌‌లానే బాబు గోగినేని కూడా…. అంటూ ప్రచారం.. ఆయన ఎలా స్పందించారంటే

Nitin Check Movie: వెండి తెరపై నితిన్ ప్లాప్ సినిమాకు బుల్లి తెరపై షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్..

Samantha: నా ఫేవరెట్‌ ఆలీగారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ కొడతారు: సమంత అక్కినేని

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!